Parliament Elections: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో నంది నగర్ నివాసంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ప్రతినిధుల బృందంతో కలిసి జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇందుకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించారు. ఈ పొత్తుకు సంబంచిన విధి విధానాలు త్వరలో ఖరారు కానున్నాయని చెప్పుకొచ్చారు.
Read Also: అనకాపల్లి రేసులోకి ఎంవీఆర్..? ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ..!!
ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో BRS- BSP కలిసి పోటీ చేయాలని నిర్ణయించామన్నారు. చాలా అంశాల్లో కలిసి పని చేశాం.. ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనేది రేపు నిర్ణయం తీసుకుంటామన్నారు. మాయావతితో ఇంకా మాట్లాడలేదు.. కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే మాట్లాడారు అని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Viral News: మతిపోయిందా వీళ్లకు.. బురదలో క్రికెట్ మ్యాచ్ ఏంట్రా బాబు..!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవటం ఆనందంగా ఉంది అని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతుంది.. కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ దేశంలో కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.. మా స్నేహం తెలంగాణను పూర్తిగా మారుస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. నాలుగు నెలలు కాకముందే కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చింది అని ఆరోపించారు.