ముషీరాబద్ అసెంబ్లీలో కవాడిగూడా, రాంనగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన OBC మోర్చా సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డా. లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీనీ ఉద్దేశించి కుటుంబం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.. కానీ యావత్ భారత దేశ ప్రజలను తన కుటుంబం అనుకుని మోడీ పని చేస్తున్నాడు అని తెలిపారు. మోడీకి కుటుంబం లేదని మాట్లాడిన లాలూ ప్రసాద్ తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం పని చేస్తున్నాడు.. తెలంగాణలో కేటీఆర్ నీ ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ పని చేస్తున్నాడు.. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ కొడుకు జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు.. ఇక, జమ్ము కాశ్మీర్ లో అబ్దుల్లా తన కొడుకు రాజకీయం కోసం పని చేస్తున్నాడు.. ఇలా మోడీని విమర్శించే వారంతా వారి వారి కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారు అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
Read Also: China: మాల్దీవులతో మా బంధం ఎవరిని టార్గెట్ చేయదు.. భారత్‌ని ఉద్దేశించి చైనా వ్యాఖ్యలు..
కానీ, నరేంద్ర మోడీ దేశ ప్రజల కోసం మాత్రమే పని చేస్తూ.. దేశ ప్రజలే తన కుటుంబమని భావిస్తున్నాడు అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. మోడీకి తోడబుట్టిన వారిలో ఒకరు రేషన్ షాపు నడుపుతుంటే.. మరొకరు బడ్ది కొట్టు నడుపుకుని బ్రతుకుతున్నారు.. మోడీకి కనీసం సొంత ఇల్లు కూడా లేదు.. మరి కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఏ హోదాలో ఉన్నారో అందరికీ తెలుసూ.. ఎంపీగా ఓడిపోయిన కేసీఆర్ బిడ్డను బ్యాక్ డోర్ నుంచి ఎమ్మెల్సీనీ చేశాడు అని ఆయన ఆరోపించారు. అంటే, ఎంపీగా ఓడిపోతే 5 ఏళ్లు కూడా తన బిడ్డ అధికారం లేకుండ ఉండలేదని ఎమ్మెల్సీనీ చేశాడు.. ప్రాంతీయ పార్టీల్లో వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారా..? పార్టీలో పని చేస్తున్న యువతకు అవకాశాలు ఉండవా? అనేది ఆలోచించాలి.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా రెండు సార్లు ప్రధానిగా పని చేసిన మోడీపై ఒక్క అవినీతి మచ్చ కూడా పడలేదు అని లక్ష్మణ్ పేర్కొన్నారు.
Read Also: Balakrishna: బాలయ్యపై కేఎస్ రవికుమార్ అనుచిత వ్యాఖ్యలు.. పిలిచి కొడతాడు అంటూ!
మోడీ ప్రధానిగా ఉంటే వారి అవినీతి కొనసాగడం లేదని సహించడం లేదు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఒక బీసీ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఓర్చుకోలేకపోతున్నారు.. దేశ వ్యాప్తంగా ఇళ్లు లేని పేద వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చాడు మన ప్రధాని మోడీ.. బీసీలకు విద్యారంగంలో రిజర్వేషన్ కల్పించి బీసీల పట్ల తన ప్రేమను చాటుకున్నారు.. ఒక వేళ బీసీ రిజర్వేషన్ అమలు చేయని విద్యా సంస్థలపై చట్ట పరమైన చర్యలు తీసుకునే చట్టాన్ని చేశాడు అని ఆయన తెలిపారు. వారు అధికారంలో ఉన్నపుడు గుర్తు రాని కుల గణన పై బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడుతుంది.. కుల గణన చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.. కానీ అది ఎలా చేస్తారో.. ఎప్పుడు చేస్తారో చెప్పడం లేదు.. ఓక దళితుడిని రాష్ట్రపతినీ చేసిన ఘనత మన మోడీది.. బీసీలను చులకనగా చూస్తున్న ఈ రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో బుద్ది చెప్పాలి.. బీసీల పక్షపాతి మన మోడీనీ మరోసారి ప్రధానినీ చేసి ఆయనకు అండగా నిలుద్ధాం అని ఎంపీ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.