CM Jagan: ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కుందురు నాగార్జున రెడ్డిని అత్యధిక మెజారిటితో గెలిపించాలి అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. మార్కాపూరంలో ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి చేసిన అభివృద్ధిని గిద్ధలూరు నియోజకవర్గంలో కూడా చేయబోతున్నారు అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కుందురు నాగార్జున రెడ్డి నిరంతరం ప్రజల కోసం కష్ట పడే వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చిన ఆయన బాధపడుతాడని సీఎం అన్నారు. మరోసారి కేపీ నాగార్జున రెడ్డిని గెలిపిస్తే మీ నియోజక వర్గం మరింత అభివృద్ధిలో దూసుకుపోతుందని సీఎం జగన్ వెల్లడించారు.
Read Also: Viral Video : స్వచ్ఛమైన బంగారంతో పప్పు.. షాక్ అవుతున్న నెటిజన్స్…
ఇక, ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ ట్విన్ కెనాల్స్ ప్రారంభోత్సవ పైలాన్ ను ఆవిష్కరించారు. వెలిగొండ ప్రాజెక్టు ఫోటో గ్యాలరీని సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించి.. జరగాల్సిన పనులపై ఆరా తీశారు సీఎం వైఎస్ జగన్.. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్ధాల కల నెరవేరిందన్నారు. టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందన్నారు.. అద్భుతమైన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు.