జనాభాలో 52 శాతం ఉన్న బీసీ కులాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపటంతో పాటు విద్య, ఉద్యోగ, రాజకీయాలులో రిజర్వేషన్స్ సౌకర్యం కలుగచేయటం కూడా జరిగింది అని హరిరామజోగయ్య తెలిపారు. ఇక, జగన్ సీఎం అయ్యాక 34శాతం రిజర్వేషన్నీ 24 శాతానికి కుదించటంతో బీసీల విరోధిగా ముద్రపడ్డారు. అయితే, ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికలలో బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన 110 అసెంబ్లీలో సీట్లు కేటాయించిన ఘనత చిరంజీవికే దక్కింది అని ఆయన చెప్పుకొచ్చారు. నారా లోకేష్ పోటీచేయబోయే మంగళగిరి నియోజకవర్గం వేదికగా జయహో బీసీ అనే నినాదంతో రాబోయే ఎన్నికల సందర్భంలో టీడీపీ- జనసేనపార్టీల ఆధ్వర్యంలో మహాసభ ఏర్పాటు చేసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ బీసీ డిక్లరేషన్ పేర 10 ఎన్నికల హామీలు ఇస్తూ ప్రకటనలు చేశారు.. బీసీలకు 50 ఏళ్ళుకే పెన్షన్లను 3 వేల నుంచి 4 వేలకు పెంచడంతో పాటు ఏడాదికి 30వేల కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 1లక్షా 50 వేల కోట్ల రూపాయిలు బీసీల సంక్షేమానికి ఖర్చుపెట్టటం చేస్తామని ఈ హామీలన్నీ చంద్రబాబు స్వయంగా ప్రకటిస్తే.. పవన్ కల్యాణ్ బీసీలకు రాజ్యాధికారం దక్కేలా చేస్తామని 11వ హామీ అదనంగా ఇచ్చారని హరిరామయ్య జోగయ్య పేర్కొన్నారు.
Read Also: Delhi: సరికొత్త చరిత్ర సృష్టించిన ఢిల్లీ వైద్యులు
ఇక, బీసీలకు వివిధ పథకాల ద్వారా దక్కుతున్న లబ్ధికన్నా మించిన లబ్ధి అనటానికి ఏమాత్రం సందేహం లేదు అని హరిరామయ్య జోగయ్య పేర్కొన్నారు. ఇదే సందర్భంగా జనాభాలో 25శాతం ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల ఆర్ధిక సామాజిక పరిస్థితులను కూడా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. కాపు కులస్తులు బ్రిటీష్ ప్రభుత్వకాలంలోనే బీసీలుగానే పరిగణింపబడుతున్నారు. అయితే, దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తప్ప మిగిలిన రెడ్డి రాజులు పరిపాలించిన కాలంలో ఈ కులాన్ని బీసీల జాబితా నుంచి తప్పించటం జరిగిందని ఆయన అన్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హాయాంలో జీఓ నెంబర్ 30 ద్వారా ఈ కులాన్ని బీసీలుగా చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో తప్పించారని వెల్లడించారు. ఇక, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ముద్రగడ పద్మనాభం చేసిన ఆందోళన ఫలితంగా మంజునాధన్ కమీషన్ ఏర్పాటు చేసి.. సదరు కమీషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈ జాతులను బీసీలుగా గుర్తిస్తూ, శాసనభ చట్టం చేసి గవర్నర్ ఆమోదం పొంది.. 9వ షెడ్యూలుగా చేర్చవలసినదిగా కేంద్రానికి పంపారు అనే విషయాన్ని హరిరామయ్య జోగయ్య తెలిపారు.
Read Also: MS Dhoni: ఐపీఎల్ కోసం జియోతో జతకట్టిన ఎంఎస్ ధోని..
ఇక, చట్టప్రకారం చూస్తే ఈనాడు కూడ కాపులు, బలిజలు, తెలగ, ఒంటరి కులస్తులను బీసీలుగానే పరిగణించవలసి వస్తుంది అని హరిరామయ్య జోగయ్య తెలిపారు. బీసీలు అంటే ఆర్ధికంగాను, విద్యాపరంగాను, సామాజికపరంగాను వెనుకబడి ఉన్నారనే దానిలో ఏమాత్రం సందేహం లేదు.. అయితే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం ఈ కులస్తులు 50 శాతం దాటి రిజర్వేషన్స్ సౌకర్యం కలుగచేయటానికి టెక్నికల్ గా, న్యాయపరంగా ప్రభుత్వాలకు ఇబ్బందులు ఉండవచ్చు అని ఆయన వెల్లడించారు. కానీ, బీసీలతో సమానంగా 25శాతం జనాభా ప్రాతిపదికన 5 సంవత్సరాలలో మరో 65 వేల కోట్లు రూపాయిలు ఈ కులస్తులకు బీసీలతో సమానంగా సంక్షేమం దక్కాల్సి ఉందన్నారు. పవన్ కళ్యాణ్ కోరిక ప్రకారం కాపు కులస్తులు కూడ యాచించే స్థితి నుంచి శాసించే స్థితిని చేరవలసిందే.. న్యాయపరంగా కూడ దీనిని కాదనే హక్కు ఎవరికీ లేదని కాపు సంక్షేమ సేవ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో 25శాతం ఉన్న కాపు కులస్తులకు కూడా టీడీపీ- జనసేన కూటమి వారి ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలతో సమానంగా అన్ని సౌకర్యాలు కలుగజేస్తూ కాపు డిక్లరేషన్ని కూడా ప్రకటించాలని హరిరామయ్య జోగయ్య డిమాండ్ చేశారు.