గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 99 శాతం హామీలను జగన్ అమలు చేశారు అని నెల్లూరు లోక్ సభ వైసీపీ సమన్వయకర్త విజయ సాయి రెడ్ది తెలిపారు. ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందో ప్రజలకు బాగా తెలుసు..
లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీనీ ఉద్దేశించి కుటుంబం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.. కానీ యావత్ భారత దేశ ప్రజలను తన కుటుంబం అనుకుని మోడీ పని చేస్తున్నాడు అని తెలిపారు. మోడీకి కుటుంబం లేదని మాట్లాడిన లాలూ ప్రసాద్ తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం పని చేస్తున్నాడు..
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ నుంచి శంఖారావం పూరించారు అని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సింహ గర్జన సభతో ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం నుంచే ప్రారంభించారు.
మేడిగడ్డకు రిపేర్ చేయాలని నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇస్తే రిపేర్లు చేస్తాం.. కేసీఆర్ చదివింది కేవలం బీఏనే.. పార్లమెంట్ ఎన్నికల్లో పీజీ చేసినట్టు సమాచారం ఇచ్చాడు.. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులే మేడిగడ్డలో దొంగలు.. ఈ దొంగల సలహాలు తీసుకొని రిపేర్లు చేయమంటారా అంటూ సీఎం అడిగారు.
రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది ఉచిత వైద్య సదుపాయాలు పొందుతున్నారు.. పథకాల అమలు అర్ధం కాకపోతే ఆర్టీఐ ద్వారా వివరాలు తెలుసుకోవాలి అని సూచించారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై కావాలనే బురద జల్లుతున్నారు అని ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి వెల్లడించారు.
టానిక్ మద్యం షాప్ లో అక్రమాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న ( సోమవారం) సాయంత్రం నుంచి GST అధికారుల సోదాలు చేస్తున్నారు. ఏ మద్యం షాప్ కు లేని వేసులుబాటు టానిక్ కు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ నగరంలో నకిలీ మందుల తయారీ గుట్టురట్టు అయింది. మెగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో మార్కెట్లోకి వస్తున్న మెడిసిన్స్ నకిలీవనీ డగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గుర్తించారు.