CM Jagan: రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేసిన సీఎం జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో గతేడాది డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారాన్ని వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,294.58 కోట్ల పరిహారాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జమ చేశారు.
Read Also: Kalki2898AD: ఇటలీలో ఆటాపాటా.. ఫ్యాన్స్ కు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిన మేకర్స్
Also Read
- తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఐదేళ్లుగా రైతులకు అండగా ఉంటున్నామన్నారు. పంట నష్టపోయిన రైతులకు తోడుగా ఉంటున్నామని చెప్పుకొచ్చారు. సచివాలయ పరిధిలోనే పంటనష్టపోయిన రైతుల లిస్ట్ ఉంటుందన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా రైతులకు పరిహారం ఇస్తున్నాం.. రైతులకు నష్టం కలగకుండా రంగు మారినా ధాన్యం కొనుగోలు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఖరీఫ్–2023లో 103 మండలాలను కరువు మండలాలను ప్రకటించడమే కాకుండా.. ఆయా మండలాల పరిధిలో 14.24 లక్షల ఎకరాల్లో 33 శాతం కంటే ఎక్కువగా పంటలు కోల్పోయిన 6,59,897 మంది రైతులకు రూ. 847.22 కోట్ల పెట్టుబడి రాయితీని అందిస్తున్నాం.. మేలో కురిసిన అకాల వర్షాల వల్ల 5 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 1,892 మంది రైతులకు రూ. 5 కోట్లు కోత అనంతరం పంట నష్టపరిహారం ఇస్తున్నామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
Read Also: Congress: రాహుల్, ప్రియాంక పోటీ చేసే నియోజకవర్గాలు ఇవే!
మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు, గాలుల వల్ల జరిగిన పంట నష్టంతో పాటు నేల కోత, ఇసుక మేటలు కారణంగా నష్టపోయిన 4.61లక్షల మంది రైతులకు రూ. 442.36 కోట్ల పెట్టుబడి రాయితీని ఇస్తున్నట్లు సీఎం జగన్ చెప్పుకొచ్చారు. తాజాగా జమ చేసిన ఇన్‌పుట్ సబ్సిడీతో కలిపి ఈ ఐదేళ్లలో 34.41 లక్షల మంది రైతులకు రూ. 3,261.60 కోట్లు పెట్టుబడి రాయితీని వైసీపీ ప్రభుత్వం అందించింది. ఈ 57 నెలల్లో పెట్టుబడి రాయితీ కింద 22.82 లక్షల వ్యవసాయ, ఉద్యాన, పట్టు రైతుల ఖాతాలకు రూ. 1,967.02 కోట్లు నేరుగా సీఎం జగన్ జమ చేశారు.
తాజావార్తలు
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..