ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలింగ్ బూతులపై ప్రధాన ఎన్నికల అధికారికి రెండు లేఖలు రాశారు. పోలింగ్ బూతుల్లో తీసుకోవాల్సిన చర్యలు.. ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామి రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు లేఖలో తెలిపిన అంశాలు.. రాష్ట్రంలో 3,005 సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి అని కోరారు. అలాగే, పోలింగ్ బూతుల బయట, లోపల వీడియోగ్రాఫీని ఏర్పాటు చేయడంతో పాటు మైక్రో అబ్సర్వర్‌లను నియమించాలి అని చెప్పుకొచ్చారు.
Read Also: Jogi Ramesh: సిద్ధం సభలు చూస్తుంటేనే చంద్రబాబు బ్యాచ్కి భయం పట్టుకుంది
ఇక, ఎన్నికల వేళా శాంతి భద్రతలకు బాధ్యత వహించే పోలీసు అధికారుల ఫోన్ నంబర్‌లను తెలియ జేయాలి అని ఎన్నికల ప్రధాన అధికారికి అచ్చెన్నాయుడు రాసిన లేఖలో తెలిపారు. అలాగే, సచివాలయం ఉద్యోగులతో రాజకీయ సమావేశాలు నిర్వహించి సీసీఏ నిబంధనలు అధిగమించారు.. వైసీపీకి మద్దతుగా సమావేశాలు నిర్వహిస్తూ ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.