MS Dhoni: ఐపీఎల్ కోసం జియోతో జతకట్టిన ఎంఎస్ ధోని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాటా ఐపీఎల్ 2024 సీజన్ అందించే క్రికెట్ విందును ఆస్వాదించేందుకు అభిమానులు సిద్ధమవుతున్న నేపథ్యంలో జియో సినిమా దీన్ని మరో ఉత్తేజకరమైన ఎడిషన్‌గా మార్చేందుకు తన ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్‌లో రెండు సినిమాలు ఉండగా మొదటి దానిలో ఎంఎస్ ధోని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూడు వాణిజ్య ప్రచార చిత్రాలు టాటా ఐపీఎల్‌ను డిజిటల్‌లో వీక్షించ వచ్చు. గత సీజన్‌లో జియో సినిమాలో రికార్డు స్థాయిలో 449 మిలియన్ల మంది వీక్షించిన టాటా ఐపీఎల్‌తో పాటు డిజిటల్‌లో క్రీడల ప్రత్యక్ష ప్రసారాలను చూడాలని కోరుకుంటున్న వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఈ క్యాంపెయిన్‌ను రూపొందించారు.
కాగా, ది స్క్రిప్ట్ రూమ్ అందించిన కాన్సెప్ట్‌కు ఎర్లీ మ్యాన్ ఫిల్మ్స్ చిత్రరూపాన్ని ఇచ్చింది. ఇందులో ఎంఎస్ ధోని తాత, మనవడిగా ద్విపాత్రల్లో కనిపిస్తారు. ఇది ఒక సరదా కథనాన్ని కలిగి ఉంటుంది. తన ఫోన్ స్క్రీన్‌పై మనవడు టాటా ఐపీఎల్ మ్యాచ్‌ను తదేకంగా వీక్షిస్తూ ఉంటాడు. తాత కూడా తన ఫోన్‌లో అదే మ్యాచ్‌ని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో తాత తన ఛాతీలో అసౌకర్యంగా ఉన్నట్లు కనిపిస్తాడు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళుతున్న సమయంలో అక్కడి మెడికల్ అటెండెంట్ కూడా తన ఫోన్‌లో ఆటను చూస్తూ ఉంటాడు. తాతామనవళ్లు నవ్వుకుంటూ వ్యాన్ వెనుక భాగంలో హాయిగా కూర్చుని మ్యాచ్ చూస్తూ ఉంటారు. తాత తేగడంతో కథనంలో మార్పు వస్తుంది. ఆయనకు అసౌకర్యం కేవలం గ్యాస్‌తోనే వచ్చిందని గుర్తిస్తారు. అప్పుడే మ్యాచ్‌లో ఆటగాడు ఒక సిక్సర్ కొడతాడు. దీంతో ఆ చిత్రానికి తెరపడుతుంది. ఈ క్యాంపెయిన్ టీవీ, డిజిటల్, సోషల్ మీడియాతో పాటు ప్రింట్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది.
Also Read
- Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
- Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
- Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
- India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
అయితే, జియో సినిమా క్రియేటివ్ మార్కెటింగ్ హెడ్ షగున్ సెడా మాట్లాడుతూ.. ఈ క్యాంపెయిన్ ఇటీవలి కాలంలో వీక్షకుల మధ్య మనం చూసిన అతి పెద్ద వినియోగ మార్పుకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఎందుకంటే వారు తమ రోజు వారీ లైవ్ స్పోర్ట్స్ యాక్షన్‌ను వీక్షించేందుకు సంప్రదాయ విధానాల నుంచి డిజిటల్‌కి మారారని పేర్కొన్నారు. ‘Sab Yahaan, Aur Kahaan!’ అనే సెంటర్ ట్యాగ్‌లైన్ టాటా ఐపిఎల్‌ను డిజిటల్‌లో వీక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారన్నారు. జియో సినిమా ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 టోర్నమెంట్‌ను సరసమైన ధరలో అందుబాటులోకి తీసుకురావడంతో పాటు భాష పరమైన అడ్డంకులు లేకుండా ప్రసారం చేస్తుంది. యాక్షన్‌లో ఎంఎస్ ధోనీని ప్రతి నిమిషాన్ని ఆరాధించే అభిమానుల అభిరుచికి అనుగుణంగా.. సృజనాత్మకతతో మేము దీన్ని రూపొందించాము అని జియో సినిమా క్రియేటివ్ మార్కెటింగ్ హెడ్ షగున్ సెడా తెలిపారు.
ఇక, ఇది మాకు కేవలం క్యాంపెయిన్ కన్నా ఎక్కువ అని జియో సినిమా క్రియేటివ్ మార్కెటింగ్ హెడ్ షగున్ సెడా తెలిపారు. పెద్ద ఏజెన్సీ అధిపతులు దీన్ని ‘‘ఆదేశం’’గా వ్యవహరిస్తారు.. ‘Sab Yahaan, Aur Kahaan!’ అనే ప్రధాన ఆలోచనను నుంచి జియో సినిమా బృందంతో కలిసి పనిచేయడం.. పలు చిత్రాలకు స్క్రిప్ట్ సిద్ధం చేయడం, ప్రొడక్షన్ టీమ్‌తో మమేకమై పని చేస్తూ, దాని ద్వారా వీక్షించడం అనేది ఒక తీవ్రమైన మరియు మానసికంగా సంతోషకరమైన ప్రయాణం’’ అని ది స్క్రిప్ట్ రూమ్ వ్యవస్థాపకుడు అయ్యప్పన్ పేర్కొన్నారు. “జియో సినిమా బృందం చూపించిన విశ్వసనీయత, సహృదయతకు కృతజ్ఞతలు. వారు మమ్మల్ని ఉత్తమ సృజనాత్మక అవుట్‌పుట్ వచ్చేలా ప్రోత్సహించినందుకు మాకు చక్కని సంతోషాన్ని ఇస్తోంది. మేము పూర్తి చేసిన పని పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ దీన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము’’ అని ది స్ర్కిప్ట్ రూమ్ వ్యవస్థాపకుడు అయ్యప్పన్ చెప్పుకొచ్చారు.
అలాగే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎంఎస్ ధోనికి చెందిన చెన్నై సూపర్ కింగ్స్ 2024 మార్చి 22న తలపడనుండగా.. దక్షిణాది డెర్బీతో జియో సినిమాలో టాటా ఐపీఎల్ 2024 ప్రారంభమవుతుంది. వీక్షకులకు హరియాణీని మొదటిసారిగా పరిచయం చేస్తుండగా.. 12 భాషల్లో 4కెలో తాజా సీజన్‌ను ఉచితంగా వీక్షించేందుకు అవకాశం కల్పించారు. మొదటిసారి హీరో క్యామ్‌తో సహా మల్టీ-క్యామ్ ఎంపికలు, జీతో ధన్ ధనా ధన్‌తో సహా మరెన్నో ఫ్యాన్స్ ఎంగేజ్‌మెంట్ ఫీచర్‌లను వినియోగదారులు ఆస్వాదించవచ్చు.
- Tags
- CSK
- Grandpa look
- JioCinema
- ms dhoni
- RCB
తాజావార్తలు
-
Anushka Shetty : అనుష్క శెట్టి సినిమాలకు ఇక గుడ్‌బై చెప్పేసినట్టేనా?
-
Sailesh Kolanu: సుహాస్ నన్ను మోసం చేశాడు..!
-
Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
-
The Emraan Era: 20 ఏళ్ల తర్వాత స్టేజ్‌పైకి ఇమ్రాన్ హష్మీ.. హైదరాబాద్‌లో డీజే బూత్‌నే ఊపేసిన సీరియల్ కిస్సర్..
-
Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!