తిరుమల నడకదారిలో మరో సారి చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత ఏడాది తిరుమల కాలి నడక మార్గంలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) అధికారులు అలర్ట్ అయ్యారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ కస్టడీ నేటితో ముగుస్తుంది. దీంతో కేజ్రీవాల్ను నేటి మధ్యాహ్నం 2 గంటలకు రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచనలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఆయన టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తుంది.
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు మేమంత సిద్ధం బస్సు యాత్ర నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది.
మహబుబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్దం అయింది. నేడు ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ సరళి కొనసాగనుంది. ఇక, ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం పడిపోతుందని కలలో కూడా ఊహించలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం ఎట్లుంటదో జనాలకు అర్థం అయ్యింది.. ఈ ప్రభుత్వంపై గ్రామాల్లో మన్నువోసుడు, దుమ్మువోసుడే కనిపిస్తుంది. అయితే, మల్కాజ్ గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి ఒక్కడే లోకల్.. ఇద్దరు నాన్ లోకలే అని ఆయన చెప్పుకొచ్చారు.
తెచ్చుకున్న తెలంగాణకు న్యాయం చేయకుండా కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడింది అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అందుకే వారి కుటుంబానికి తగిలే దెబ్బలు ప్రజలందరూ స్వీకరిస్తున్నారు.