Lok Sabha elections: భారత దేశంలో ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాలను విడతల వారీగా రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఏక్‌నాథ్ షిండే’ నేతృత్వంలోని శివసేన తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం 8 మందిని ప్రకటించింది. ఇందులో ఇటీవల కాంగ్రెస్ నుంచి శివసేనలో చేరిన ‘రాజు పర్వే’ను రామ్‌టెక్ నుంచి బరిలో దించగా.. ముంబై సౌత్ సెంట్రల్ నుంచి రాహుల్ షెవాలే, కొల్హాపూర్ నుంచి సంజయ్ మాండ్లిక్, షిర్డీ నుంచి సదాశివ్ లోఖండే, బుల్దానా నుంచి ప్రతాపరావు జాదవ్, హింగోలి నుంచి హేమంత్ పాటిల్, మావాల్ నుంచి శ్రీరంగ్ బర్నే, హత్కనంగలే నుంచి ధైర్యషీల్ మానే పోటీ చేయబోతున్నారు అని తెలిపారు.
Read Also: RCB VS KKR: స్వదేశంలో.. ఆర్సీబీ ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా..!
ఇక, బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాడు. లోక్‌సభ ఎన్నికల ముందు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో జాయిన్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి శివసేన పార్టీ తరఫున గోవిందా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఈ సందర్భంగా గోవిందా మాట్లాడుతూ.. ఏక్‌నాథ్ షిండే నాయకత్వం.. పార్టీలో చేరడానికి తనను ప్రేరేపించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని వెల్లడించారు. ఇక, మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో ఐదు దశల్లో జరగబోతున్నాయి. అలాగే, శివసేన- ఏక్‌నాథ్ షిండే వర్గం ఎన్‌డీయే కూటమిలో భాగంగా ఉంటుంది.