కేరళ బీజేపీ అధ్యక్షుడు, వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న కే సురేంద్రన్‌పై ఏకంగా 242 క్రిమినల్ కేసులు నమోదైనట్టు తెలిపారు.
డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇవాళ (శనివారం) ఉదయం సేలంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన ఉన్న ఓ ఛాయ్ దుకాణంలోకి వెళ్లి.. అక్కడ ఛాయ్ పెట్టించుకుని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాగారు.
వేసవి ఎండలు రోజు రోజుకూ మండిపోతుండటంతో ఆ తాపాన్ని తగ్గించుకునేందుకు జనం పలు రకాల పానీయాలను తాగుతుంటారు. దీంతో మార్కెట్లో నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి.
ఏప్రిల్ 2వ తేదీన ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్- ఉధమ్ సింగ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం రుద్రాపూర్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటనను రిలీజ్ చేసింది. లోక్‌సభ ఎన్నికలు 2024లో ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి ఏడవ దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది.
భారత దేశంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఔషద మందుల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(NPPA) ఔషధాల టోకు ధర సూచికలో వార్షిక సవరణలు చేసినట్లు సమాచారం.
వాయువ్య హిందూ మహా సముద్రంలో హైజాక్ అయిన ఇరాన్ చేపల బోటుతో పాటు అందులో సిబ్బందిని కూడా రక్షించింది. కాగా, బోటులో ఉన్న వారు పాకిస్థాన్‌కు చెందిన 23 మంది సిబ్బంది అని భారత నేవీ అధికారులు తెలిపారు.