కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదు.. మల్కాజ్ గిరి పార్లమెంట్ లో వాళ్ళకి క్యాడర్ లేదు.. ఏం మొహం పెట్టుకొని వాళ్లు ఓట్లు అడుగుతారు అని మాజీ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపైన ఆయన ఘాటైన కామెంట్స్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఎమ్మెల్యే దానం నాగేందర్ కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు అయింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు.
తెలంగాణలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శివ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి..
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి చివరి వారంలోనే భానుడు భగభగ మంటు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక, ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అవుతున్నాయి.
మహిళా ఫిర్యాదురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసారు.