IPL 2024: ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ మార్పుతో టీమ్ను రెండు గ్రూపులుగా విడిపోయినట్లు కనిపిస్తుంది. జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్‌శర్మను ఈ సీజన్‌కు ముందు తప్పించి గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడంపై అభిమానులు రెండు నెలల నుంచే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో ‘టీమ్ రోహిత్’ వర్సెస్ ‘టీమ్ హార్దిక్’గా ఆటగాళ్లు విడిపోయినట్టు పుకార్లు షికార్లు అవుతున్నాయి. గ్రౌండ్ లో హార్థిక్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర వివాదం అవుతున్నాయి. స్టార్ పేసర్ బుమ్రాను పక్కనబెట్టి 3 లేదా 4 ఓవర్లో బౌలింగ్ ఇవ్వడంతో పాటు అస్సలు అనుభవం లేని బౌలర్ క్వెనా మపాకాకు ఓపెనింగ్ ఓవర్ ఇవ్వడంతో హార్థిక్ ను రోహిత్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: Mukhtar Ansari : మా నాన్నకు విషమిచ్చి హత్య చేశారు.. అన్సారీని చూసి కొడుకు ఆరోపణ
ఇక, దీనికి తోడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా మైదానంలో వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చకు దారి తీసింది. రోహిత్‌ను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్‌కు పంపడాన్ని ముంబై అభిమానులైతే అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. హార్దిక్ సారథ్యంపై ఇది వరకే బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక, డ్రెస్సింగ్ రూమ్‌లోనూ బుమ్రా, తిలక్ వర్మ, ఆకాశ్ మధ్వాల్ లాంటి ముంబై ప్లేయర్లు ఒక వర్గంగా ఉండగా.. ఇన్నాళ్లు రోహిత్‌కు విధేయుడిగా ఉన్న ఇషాన్ కిషన్ ఇప్పుడు హార్థిక్ పాండ్యా గ్రూప్‌లో చేరినట్టు గుసగుసలు వినపడుతున్నాయి. అంబానీల అండ సంపూర్ణంగా ఉన్న హార్దిక్.. తన సొంత టీమ్ ను ఏర్పాటు చేసుకునేందుకు గత సీజన్‌లో ఆడిన కీలక ప్లేయర్లను వదిలి పెట్టినట్లు తెలుస్తుంది.
Read Also: Padmarajan: నీకు ఇదేం పిచ్చి భయ్యా.. అన్ని సార్లు ఓడిపోయిన మళ్లీ పోటీ చేస్తానంటావ్..
అయితే, కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మ ఇంత వరకూ బహిరంగంగా రియాక్ట్ కాలేదు.. కానీ, అతడు అసంతృప్తిగానే ఉన్నట్టు కొంత కాలంగా కనిపిస్తుంది. హిట్‌మ్యాన్ ముంబై క్యాంప్‌లో చేరగానే హార్దిక్ పాండ్యా వెళ్లి.. హగ్ చేసుకున్న ఫొటోలను ముంబై షేర్ చేసి.. ఇక్కడ ‘అంతా బాగానే ఉంది’ అన్నట్టు కవర్ చేయాలని చూసినా ఇదంతా ‘ఉత్త కథే’ అని ముంబై గుజరాత్ మ్యాచ్ లో తేలిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే ముంబైకి మరో సీజన్‌లోనూ నిరాశ తప్పదని క్రీడావిశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి రోజు రోజుకి ముదురుతున్న రోహిత్-హార్దిక్ పాండ్యా వివాదాన్ని అంబానీలు ఎంత త్వరగా పరిష్కరిస్తానేది వేచి చూడాలి.