ఉప్పల్లో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా నేటి సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని సీపీ తరుణ్ జోషి తెలిపారు. బోడుప్పల్, చెంగిచెర్ల, పీర్జాదిగూడ నుంచి వచ్చే వాహనాలను హెచ్ఎండీఏ భగాయత్ లే అవుట్ ద్వారా నాగోల్ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు.
టీచర్స్ రిక్రూట్మెంట్ కుంభ కోణంలో పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రనాథ్ సిన్హాకు ఎన్ ఫోర్స్మెంట్ (ఈడీ) ఇవాళ (మంగళవారం) నోటీసులు జారీ చేసింది. మార్చి 22న సిన్హా నివాసంపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై హాట్ కామెంట్స్ చేశారు. దేశం ప్రశాంతంగా ఉండాలంటే మోడీ తిరిగి అధికారంలోకి రావొద్దని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశమంతా అల్లర్లతో అల్లకల్లోలంగా మారుతుందని ఓట్లర్లను ఆయన హెచ్చరించారు.
ఆసియా బిలియనీర్ క్యాపిటల్గా తొలిసారి భారత ఆర్థిక రాజధాని ముంబై నిలిచింది. ముంబైలో మొత్తం 92 మంది బిలియనీర్లు మాత్రమే ఉండగా.. ఈ సంఖ్య బీజింగ్లో 91గా ఉంది.
ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ఐకమత్యంతో అందరం కలిసికట్టుగా పనిచేసి ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా వేగర వేద్దాం అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మనందరి జీవితాలు మారుతాయి అన్నారు.