కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన విమానాల లీజు వ్యవహారంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తాజాగా సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లోక్ సభ ఎన్నికలకు ముందు ఐటీ విభాగం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయటం లాంటి అంశాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి రియాక్ట్ అయింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ 'తీవ్రమైన సంక్షోభంలో' ఉంది అని తెలిపాడు.
'ఏక్నాథ్ షిండే' నేతృత్వంలోని శివసేన తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే ప్రభుత్వం 8 మందిని ప్రకటించింది.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా వైదొలిగిన తర్వాత తొలి సారిగా మహేంద్ర సింగ్ ధోని స్పందించారు. తనకు మజిల్ పవర్ తక్కువని.. ఫీల్డింగ్ లో జరిగిన తప్పుల గురించి త్వరగా స్పందించలేనని చెప్పుకొచ్చారు.
కర్ణాటక రాష్ట్రంలో రైతు సంఘాలన్నీ ఒక్కటవుతున్నాయి. రైతుల బాధలు పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లోక్ సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వారు భావిస్తున్నారు.
ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్(ED),సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్న్(CBI) స్వతంత్ర దర్యాప్తు సంస్థలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.
ఈ ఏడాది మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతుంది. జూలై 18 నుంచి 28వ తేదీ వరకు దంబుల్లాలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు.