ఈ ఏడాది మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతుంది. జూలై 18 నుంచి 28వ తేదీ వరకు దంబుల్లాలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. అయితే, 2022లో చివరిసారి బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ టోర్నిలో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఏడో సారి టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఇక, క్రితం సారి ఏడు టీమ్స్ పాల్గొనగా.. ఈసారి ఎనిమిది జట్లు పోటీ పడనున్నాయని జైషా వెల్లడించారు.
Read Also: Congress : కాంగ్రెస్ కు డబుల్ షాక్.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ.. ఐటీ శాఖ నోటీసులు
ఇక, గ్రూప్ ‘A’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్.. ఇక, గ్రూప్ ‘B’లో శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్‌లాండ్ జట్లు ఉండనున్నాయి. భారత్ తమ మూడు లీగ్ మ్యాచ్‌లను వరుసగా యూఏఈ (జూలై 19న), పాకిస్తాన్ (జూలై 21న), నేపాల్ (జూలై 23న) జట్లతో ఆడనుంది. జూలై 26వ తేదీన సెమీ ఫైనల్స్.. జూలై 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.