నేడు అమలాపురం, రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ పరిధిలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇక, రావులపాలెం, రామచంద్రపురంలో టీడీపీ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు.
లోక్ సభ ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆసరా పెన్షన్ల పంపిణీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్లను తప్పించడంతో పెన్షన్‌దారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (బుధవారం) 7వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు అమ్మవారిపల్లె నుంచి జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
గ్రేటర్ నోయిడాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. వరకట్న వేధింపులతో ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. కట్నం కింద ఫార్చ్యునర్ కారుతో పాటు 21 లక్షల రూపాయల క్యాష్ ఇవ్వలేదన్న కారణంతో.. మహిళ భర్త, అతని కుటుంబసభ్యులు ఆమెను చిత్రహింసలకు గురి చంపేశారు.