ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఆయన 6 నెలల పాటు తీహార్ జైలులో ఉన్నారు. సంజయ్ సింగ్ కూడా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు అని సుప్రీం కోర్టు తెలిపింది.
Read Also: Summer Tips : ఎండలో వెళ్లొచ్చి వాటర్ తాగుతున్నారా? మీ ప్రాణాలు డేంజర్లో పడ్డట్లే..
కాగా, సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ పీబీ వరాలేలతో కూడినసుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. సంజయ్ సింగ్‌ను ఇంకా జైల్లో ఉంచాల్సిన అవసరం ఏముందని ఈడీని కోర్టు ప్రశ్నించింది. మనీలాండరింగ్ నిర్ధారణ కాలేదు.. మనీ ట్రయల్ కూడా కనుగొనబడలేదని సంజయ్ సింగ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ చేసిన ధర్మాసనం ఎంపీ సంజయ్ సింగ్ కు బెయిల్ మంజూరు చేసింది. ఇక, మనీలాండరింగ్ కేసులో తనను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని సవాలు చేస్తూ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సంజయ్ సింగ్ వద్ద నుంచి ఎలాంటి నగదు లభించలేదని, ఆయనపై రూ.2 కోట్లు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేయవచ్చని ఆప్ ఎంపీ తరపు న్యాయవాది వాదనను సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.