7వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన..
నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 7వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు అమ్మవారిపల్లె నుంచి జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర సదుం, కల్లూరు, దామలచెరువు, తలుపులపల్లి మీదగా తేనెపల్లి, రంగంపేట క్రాస్ రోడ్ మీదుగా మధ్యాహ్నానికి చేరుకోనున్నారు. ఇక, మధ్యాహ్నం తేనెపల్లిలో లంచ్ బ్రేక్ తర్వాత పూతలపట్టు బైపాస్ సమీపంలో వైసీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఆ తర్వాత పి. కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లెకు జగన్ చేరుకోనున్నారు. అక్కడే రాత్రికి వైఎస్ జగన్ బస చేయనున్నారు.
నేటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం యాత్ర.. షెడ్యూల్ ఇదే!
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగళం పర్యటనలకు రెండో విడత షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ్టి (బుధవారం) నుంచి ఐదు రోజుల పాటు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నేడు అమలాపురం, రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ పరిధిలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇక, రావులపాలెం, రామచంద్రపురంలో టీడీపీ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ బహిరంగ సభలకు భారీ ఎత్తున ప్రజలను పార్టీ నేతలు సమీకరిస్తున్నారు. అలాగే, రేపు కొవ్వూరు, గోపాలపురంలో చంద్రబాబు రోడ్‌షోలో పాల్గొంటారు. ఇక, ఏప్రిల్ 5వ తేదీన నరసాపురం, పాలకొల్లు, 6న పెదకూరపాడు, సత్తెనపల్లి, 7న పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే, ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం నిర్వహించిన తర్వాత సాయంత్రం 6 గంటలకు రెండో సమావేశం నిర్వహించేలా చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు. తొలి విడతలో 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్ షోల్లో నిర్వహించిన చంద్రబాబు రెండో విడత యాత్రను నేటి నుంచి కొనసాగించనున్నారు.
నేడు పెన్షన్ల పంపిణీపై ఏపీ హైకోర్టులో విచారణ..
లోక్ సభ ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆసరా పెన్షన్ల పంపిణీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్లను తప్పించడంతో పెన్షన్‌దారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో గుంటూరుకు చెందిన ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసింది. ఇంటి దగ్గరే పెన్షన్లు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పెన్షనర్లు ఆ పిటిషన్‌లో తెలిపారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వకపోతే తీవ్ర ఇబ్బందులు పడతామన్నారు. ఇక, పెన్షనర్ల పిటిషన్‌పై నేడు (బుధవారం) ఏపీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక, ఏపీ హైకోర్టు పెన్షన్‌దారుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించే అవకాశం కనిపిస్తుంది. ఒక వేళ ఈ పిటిషన్‌పై విచారణ జరిపితే ఎలాంటి తీర్పు ఇస్తుందోనని తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. కాగా, పెన్షన్ల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లను తొలగించాలని ఈసీ ఆదేశించింది. వాలంటీర్ల తొలగింపుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. టీడీపీ వల్లే వాలంటీర్లను తొలగించారని వైసీపీ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. ఈ క్రమంలో పెన్సన్లర్లు హైకోర్టును ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నేడు ముషీరాబాద్ లో కిషన్ రెడ్డి పర్యటన..
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి తెలంగాణ రాష్ట్రంపైనే ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ఈనేపథ్యంలో.. హైదరాబాద్ లో ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 8గంటలకు ముషీరాబాద్ లో కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వాడవాడ తిరుగుతూ పర్యటించి బీజేపీ పథకాల గురించి వివరించనున్నారు. ముషీరాబాద్ అసెంబ్లీలోని అరుణ కోపరేటివ్ సొసైటీ, ముషీరాబాద్ డివిజన్, మల్లేష్ టవర్స్, నియర్ శివాలయం, ముషీరాబాద్ డివిజన్, పద్మ కాలనీ, అడిక్మెట్ డివిజన్, జెమినీ కాలనీ వెల్ఫేర్ సొసైటీ, రాంనగర్ డివిజన్ లలో ఆయన పర్యటన కొనసాగనుంది.
జోరుగా బీజేపీ ఎన్నికల ప్రచారం.. యూపీలో అమిత్ షా, రాజ్నాథ్సింగ్, సీఎం యోగి పర్యటన..
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకులు ఇవాళ (బుధవారం) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కొందరు నేతలు తమ నామినేషన్ సమావేశాలకు హాజరవుతూ బీజేపీ అభ్యర్థులకు మద్దతను ఇస్తున్నారు. నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు ముజఫర్‌నగర్‌లోని బుధానాలోని నేషనల్ ఇంటర్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు మొరాదాబాద్‌లో సమావేశమై మొదటి, రెండో దశ సీట్ల విషయంలో పార్టీ నేతలతో ఎన్నికల వ్యూహం ఖరారు చేయనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఘజియాబాద్‌లోని ఘంటాఘర్ ప్రాంతంలోని రామ్‌లీలా గ్రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అతుల్ గార్గ్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతారు. అలాగే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేడు ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా లోక్‌సభ నియోజకవర్గాల్లో జ్ఞానోదయ సదస్సుల్లో పాల్గొననున్నారు.
బీహార్ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం.. 58ఇళ్లు బుగ్గిపాలు
బీహార్లో భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ స్టవ్ స్పార్క్ 50కి పైగా ఇళ్లను తగలబెట్టింది. ఈ సమయంలో గ్యాస్ సిలిండర్ కూడా పేలింది. దీనివల్ల మంటలు మరింత అరుదైన రూపాన్ని కదిలించాయి. ఈ సంఘటనలో లక్షలాది విలువైన ఆస్తి బుగ్గిపాలైంది. అగ్ని ప్రమాదంలో తండ్రికొడుకు తీవ్రంగా కాలిపోయారు. వారిని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన వారిని కిషోర్ రాయ్, అతని 4 -సంవత్సరాల కుమారుడు ఆశిష్ కుమార్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో పిల్లవాడు కూడా తప్పిపోయాడు. ఈ భయంకరమైన అగ్నిలో చాలా పశువులు చనిపోయాయి. ఫైర్ ఇంజన్లు ఒక గంట కృషి తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. భయంకరమైన అగ్ని ప్రమాదం విషయం తెలిసిన తర్వాత కూడా ఏ అధికారి ఈ అక్కడికి చేరుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన సుపాల్ లోని జాడియా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందినది. మంగళవారం మధ్యాహ్నం పిలువాహా పంచాయతీలో ఏడు వార్డులో మంగళవారం మధ్యాహ్నం టౌన్షిప్ 51 ఇళ్లు బూడిదయ్యాయి.
తైవాన్‌లో భూకంపం.. భారీ విపత్తు.. సునామి హెచ్చరికలు జారీ
తైవాన్‌లో ఈ రోజు (బుధవారం) శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో ద్వీపం మొత్తం వణికిపోయింది. వందలాది భవనాలు కుప్పకూలాయి. జపాన్ దక్షిణ ద్వీప సమూహం ఒకినావాకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ విమానాలు రద్దు చేయబడ్డాయి. ఫిలిప్పీన్స్ కూడా సునామీని హెచ్చరించింది. తీర ప్రాంతాలను ఖాళీ చేయమని ఆదేశించింది. భూకంపం తర్వాత 3 మీటర్ల (9.8 అడుగులు) వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. దాదాపు అరగంట తర్వాత సునామీ మొదటి అల ఇప్పటికే మియాకో, యాయామా దీవుల తీరాలను తాకినట్లు తెలిపింది. తైవాన్ భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ 7.2 తీవ్రతను నమోదు చేయగా, అమెరికా జియోలాజికల్ సర్వే 7.4గా పేర్కొంది. భూకంప కేంద్రం హువాలిన్ నగరానికి దక్షిణంగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. హువాలిన్‌లో భవనాల పునాదులు కదిలాయి. రాజధాని తైపీలో కూడా భూకంపం సంభవించింది.
గెలుపులతో ఫుల్ జోష్ లో ఇరు జట్లు.. మరి ఈసారి విజయం ఎవరికీ వరించేనో..?!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా 16వ మ్యాచ్ లో, ఢిల్లీ క్యాపిటల్స్ ఏప్రిల్ 3 విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కి ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు జట్లూ విజయంతో బరిలోకి దిగుతున్నాయి. నేడు వైజాగ్ లో ఢిల్లీకి రెండో మరియు చివరి హోమ్ మ్యాచ్. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ తమ మిగితా ఐదు హోమ్ గేమ్ లను ఆడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ వారి ముందు మ్యాచ్ లో విజయం సాధించగా., కోల్కతా నైట్ రైడర్స్ వారి హోమ్ గ్రౌండ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుని ఓడించింది. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ కంటే కోల్కతా నైట్ రైడర్స్ మెరుగ్గా ఉంది.
అయలాన్ తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళస్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన సినిమా వస్తుంటాయి.. దాంతో ఇక్కడి ప్రజలకు కూడా ఈయన పేరు సుపరిచితమే.. ఈ ఏడాది సంక్రాంతికి అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తమిళంలో సంక్రాంతికి థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది అయలాన్ మూవీ. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా దాదాపు 97 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకుంది. 2024లో కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను దక్కించుకున్న సినిమాల్లో ఒకటిగా మంచి విజయాన్ని అయితే ఓటీటీలోకి మాత్రం ఆలస్యంగా రాబోతుంది.. ఓటీటీ విడుదల పై గతంలో ఎన్నో వార్తలు వినిపించిన కూడా మేకర్స్ ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు.. తాజాగా ఓటీటీలోకి విడుదల కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.