భారత దేశంలో డీజిల్, పెట్రోల్ కార్ల వాడకానికి పూర్తిగా స్వస్తి పలకాలని గతంలో వ్యాఖ్యానించిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరో సారి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్ తో పాటు రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్‌లోని కోట్‌పుట్లీలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
సిరియా రాజధాని డమాస్కస్‌లో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయ కాన్సులర్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ ఘటనలో ఇరాన్‌కు చెందిన సీనియర్ సైనిక సలహాదారుతో పాటు ఇతర సిబ్బంది మరణించారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇవాళ ( సోమవారం ) తొలిసారి భేటీ అయింది. సీనియర్ బీజేపీ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల మేనిఫెస్టో కమిటీలో పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి నలుగురు ముఖ్యమంత్రులతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సరిహద్దులపై చైనా మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తమవేనంటూ.. వాటికి పేర్లను మారుస్తున్నట్లు వెల్లడించింది.
ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లాలోని భీమకాళీ ఆలయంలో ఇవాళ (సోమవారం) ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ రిలీప్ ఇచ్చింది. రూ.3500 కోట్ల పన్ను బకాయిల విషయంలో జూలై 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆదాయపన్ను శాఖ సుప్రీంకోర్టులో తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడి నేటితో ముగియడంతో ఆయనను ఈడీ అధికారులు ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చారు. ఇక, కోర్టు కేజ్రీవాల్ కు జుడిషీయల్ రిమాండ్ విధించింది.
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి పశ్చిమ నియోజకవర్గం ప్రజలు బుద్ది చెప్పబోతున్నారు అని పేర్కొన్నారు.