తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ..ప్రజలు నాకు ఓటేస్తారని భరోసా ఇస్తున్నారు తెలిపింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్ట లేదు అని చెప్పుకొచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన పేరు రావడంతో మంత్రి అతిషి ఇవాళ స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి అతిషి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై సంచలన ఆరోపణలు చేశారు.
గత సంవత్సరం లోక్ సభ నుంచి బహిష్కరించబడిన తర్వాత మరోసారి కృష్ణానగర్ స్థానం నుంచి టీఎంసీ తిరిగి మహువా మొయిత్రాను ఎంపీ అభ్యర్థిగా నామినేట్ చేసింది. ఈ సందర్భంగా మహువా మొయిత్రా మాట్లాడుతూ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కాషాయ పార్టీకి రాజకీయ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది. కేంద్రానికి మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్న సెలక్షన్ కమిటీ ద్వారా కమీషనర్లను ఎంపిక చేసినందున ఎన్నికల సంఘం “స్వాతంత్ర్యం కోల్పోయింది” అని మాజీ […]
ఓ వార్తను కవరేజ్ చేసేందుకు వచ్చిన జర్నలిస్ట్ గున్వంత్ కలాల్ పై చిరుత దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. అతడి కాలును నోటితో కరిచి పట్టుకోవడంతో అతడు ధైర్యంగా పోరాడి చిరుతను గట్టిగా పట్టేసుకున్నాడు. దాని దవడ, మెడను గట్టిగా పట్టుకుని.. ఆ తర్వాత చిరుత పులిని బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరో దుందుడుకు చర్యకు దిగింది. చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.