ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రచారంలో ఆయన దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో జగన్ ప్రజల్లోకి వెళ్తు్న్నారు.
Read Also: DC vs KKR: గెలుపులతో ఫుల్ జోష్ లో ఇరు జట్లు.. మరి ఈసారి విజయం ఎవరికీ వరించేనో..?!
కాగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (బుధవారం) 7వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు అమ్మవారిపల్లె నుంచి జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర సదుం, కల్లూరు, దామలచెరువు, తలుపులపల్లి మీదగా తేనెపల్లి, రంగంపేట క్రాస్ రోడ్ మీదుగా మధ్యాహ్నానికి చేరుకోనున్నారు. ఇక, మధ్యాహ్నం తేనెపల్లిలో లంచ్ బ్రేక్ తర్వాత పూతలపట్టు బైపాస్ సమీపంలో వైసీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఆ తర్వాత పి. కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లెకు జగన్ చేరుకోనున్నారు. అక్కడే రాత్రికి వైఎస్ జగన్ బస చేయనున్నారు.