అంబర్ పేట్ నియోజకవర్గం కాచిగూడ డివిజన్ పర్యటనలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 13వ తేదీన తెలంగాణలో లోక్ సభలో ఎన్నికలు జరగనున్నాయి.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ కెమికల్ పరిశ్రమలో పేలుడు వల్ల గాయపడిన వారిని ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి పరామర్శించారు.
హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు ఫేక్ కరెన్సీ ముఠాలు బయట పడుతున్నాయి. ఇవాళ ( గురువారం ) బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక పరిణామం జరిగింది. చంచల్ గూడ జైలు నుంచి HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విడుదల అయ్యారు. నాంపల్లి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను శివ బాలకృష్ణకు మంజూరు చేసింది.
తాండూరులో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై గిరిజన బాలికల వసతి గృహ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో తన కూతురు తీవ్ర అస్వస్థతకు గురై ఇబ్బందికరంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని గిరిజన బాలికల వసతి గృహ విద్యార్థిని తండ్రి రాములు నాయక్ ఆరోపించారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడికి మరో రైతు బలైపోయాడు. పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య అనే రైతు వ్యవసాయ పనుల కోసం పంట పొలంలోని కరెంటు మోటార్ వేయడానికి ఇవాళ (గురువారం) ఉదయం వెళ్లే క్రమంలో ఏనుగు ఒక్క సారిగా దాడి చేయడంతో.. పోచయ్య అక్కడికక్కడే మృతి చెందారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు త్రిమెన్ కమిటీ నేడు (గురువారం) ప్రత్యేకంగా సమావేశం కానుంది.
సంగారెడ్డి జిల్లాలో బుధవారం నాడు సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ దగ్గర ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు చేలరేగడంతో అక్కడే పని చేస్తున్న పలువురు కార్మికులు ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
హనుమకొండ జిల్లాలోని డబ్బాలు, కుమారపెల్లి మార్కెట్ కేంద్రంగా చేసుకొని యువత గంజాయి సేవిస్తున్నారు అని సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్థ రాత్రి వేళలో పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.