చరిత్రలో నిలిచిపోయే సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేశారు.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ లు కూడా ప్రజల కోసం పని చేశారు అని పేర్కొన్నారు. వాళ్ళిద్దరికి మించి, ప్రతి ఇంటికి చేరువైన ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల మనసు గెలిచారు అని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెల్లడించారు.
2025 నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అగ్నిపథ్ స్కీమ్‌ను కూడా రద్దు చేసి సాయుధ దళాలకు రెగ్యులర్ రిటైర్మెంట్ను వర్తింపచేస్తామని ఆయన చెప్పారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ మొదట ముఖ్యమంత్రి అన్నాడు.. ఆ తర్వాత మంత్రి అన్నాడు.. ఇప్పుడు ఎమ్మెల్యే చేయమంటున్నాడు.. ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు రేపు కార్పొరేటర్ స్థాయికి వస్తాడు అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటర్ల వ్యవస్థపై గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏడ్చారు అని పోసాని కృష్ణ మురళి అన్నారు. మగ వాలంటర్లు నారా లోకేష్ లా తాగుబోతులు.. తిరుగు బోతులు కాదు అని మండిపడ్డారు. చంద్రబాబుకు సిగ్గు ఉండాలి.. వాలంటర్ల వ్యవస్థపై చంద్రబాబుకు కన్ను కుట్టింది అని పేర్కొన్నారు.
గత సోమవారం నాడు తన నియోజక పరిధిలోని శ్రిహిపుర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. అక్కడ ఆయన ఓ యువతి అందరు చూస్తుండగానే ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
సర్వేపల్లి నియోజకవర్గంలో భూ కుంభకోణం జరిగింది అని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది అన్నారు. కాకణి ఆధ్వర్యంలో దోపిడీ జరుగుతోంది.. 7 వేల ఎకరాలు ఇచ్చాం అని చెప్పే కాకణి.. మండల కార్యాలయాల్లో వాటి వివరాలను ప్రదర్శించాలి అని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే పలువురు పేరును విడుదల చేయగా.. ఇవాళ ( మంగళవారం ) మరో ఆరు లోక్ సభ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
‘నా నియోజకవర్గం నుంచి వేరొకరికి టికెట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుంటాను అని పేర్కొన్నారు. కార్యకర్తలే తన కుటుంబ సభ్యులు అని చెప్పుకొచ్చారు. వారు చెప్పినట్టుగానే చెస్తాను.. రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి త్వరలోనే తుది నిర్ణయం ప్రకటిస్తా అని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు వెల్లడించారు.
మేమంతా సిద్ధం 12వ రోజు రేపటి (ఏప్రిల్ 10) షెడ్యూల్‌ను వైసీపీ ఇవాళ (మంగళవారం) విడుదల చేసింది. ఈ యాత్రలో భాగంగా వైసీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరనున్నారు.
వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేద్దామనుకున్నా.. చంద్రబాబు నేడు వారిపై కల్లబొల్లి ప్రేమ వలకపోస్తున్నాడు అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు కుటీల వాగ్దానాలను ఎవరు నమ్మరు.. ప్రజల్లో తిరుగుబాటు రావడంతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడు అని పేర్కొన్నారు.