Somireddy Chandra Mohan Reddy: సర్వేపల్లి నియోజకవర్గంలో భూ కుంభకోణం జరిగింది అని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది అన్నారు. కాకణి ఆధ్వర్యంలో దోపిడీ జరుగుతోంది.. 7 వేల ఎకరాలు ఇచ్చాం అని చెప్పే కాకణి.. మండల కార్యాలయాల్లో వాటి వివరాలను ప్రదర్శించాలి అని తెలిపారు. శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నామని చెప్పి దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మనుబోలు మండలంలో తెలుగు దేశం పార్టీలో చేరిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు అని పేర్కొన్నారు. మంత్రి కాకణి గోవర్థన్ రెడ్డి అల్లుడి తరపున మీడియేటర్ మాట్లాడి డీల్ చేస్తున్నాడు.. టీడీపీలో చేరితే భూములను జాబితాలో పెడతామని బెదిరిస్తున్నారు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Kejriwal: కేజ్రీవాల్ రాజీనామాపై పిటిషన్లు.. హైకోర్టు ఘాటు వార్నింగ్
పేదలకు తక్కువ డబ్బులు చెల్లించి కాకణి అల్లుడు భూ దోపిడీ చేస్తున్నాడు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అల్లుడి కోసం రామదాసు కండ్రిగలో బినామీ కంపెనీకి 56 ఎకరాల కోట్ల రూపాయల విలువ చేసే భూములని కాకాణి కట్టబెట్టాడు అని చెప్పుకొచ్చారు. పేదల పట్టాలను ఇంటిలో పెట్టుకొని టీడీపీలో చేరితే పట్టా ఇవ్వబోమని కాకాణీ బెదిరిస్తున్నారు.. జూన్ నాలుగు వరకూ ఇళ్ల పట్టాలపై బెదిరింపులకు పాల్పడకుండా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు. సర్వేపల్లి కాకణి భూ దోపిడీ, బెదిరింపులను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.