Lok sabha Election 2024: రానున్న లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇవాళ ( బుధవారం) విడుదల చేశారు. 2025 నాటికి రాష్ట్రంలో కుల గణన చేపడతామన్నారు. అలాగే, అగ్నిపథ్ స్కీమ్‌ను క్యాన్సిల్ చేస్తామని ఎస్పీ పార్టీ మేనిఫెస్టోలో వెల్లడించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ వ్యాప్తంగా కుల గణన చేపడతామని హామీ ఇచ్చారు.
Read Also: Tamil Nadu: లోక్సభ అభ్యర్థికి ‘చిలుక జోస్యం’.. వ్యక్తి అరెస్ట్.
కాగా, 2025 నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అగ్నిపథ్ స్కీమ్‌ను కూడా రద్దు చేసి సాయుధ దళాలకు రెగ్యులర్ రిటైర్మెంట్‌ను వర్తింపచేస్తామని ఆయన చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, మీడియా స్వేచ్ఛా హక్కు, సామాజిక న్యాయ హక్కు దేశ అభివృద్ధికి కీలకమని విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచామని మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. కుల గణన లేకుండా సమ్మిళిత వృద్ధి సాధ్యం కాదు.. దేశ అభివృద్ధికి కుల గణన దిక్సూచీ లాంటిదని ఆయన చెప్పుకొచ్చారు.