West Bengal: అందరు చూస్తుండగానే.. ఓ యువతికి ముద్దు పెట్టిన బీజేపీ ఎంపీ అభ్యర్థి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Candidate Kisses Woman: లోక్‌సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర మాల్దా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్మూ పోటీ చేస్తున్నారు. గత సోమవారం నాడు తన నియోజక పరిధిలోని శ్రిహిపుర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. అక్కడ ఆయన ఓ యువతి అందరు చూస్తుండగానే ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనపై అధికార తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో వేదిగా.. బీజేపీపై విమర్శలు గుప్పించింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీలు.. బెంగాలీ మహిళలపై అసభ్యకర పాటలు రాసే వారు.. ఇలా బీజేపీ పార్టీలో మహిళా వ్యతిరేక నాయకులకు కొదవలేదు అంటూ టీఎంసీ విమర్శలు గుప్పించింది. నారీమణులకు ‘మోడీ పరివార్’ ఇస్తున్న గౌరవం ఇదేనంటూ నెట్టింట పేర్కొంది. ఒకవేళ వారు అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండి అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
Read Also: Jr NTR Fans: అభిమానమా, లేక పైత్యమా? ఇదేం పని?
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
కాగా, ఈ ముద్దు సీన్ వివాదం కావడంతో ఎంపీ ఖగేన్ స్పందిస్తూ ఘటనపై క్లారిటీ ఇచ్చారు. ఆమెను నా కుమార్తెలా భావించాను.. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటి?.. కుట్రపూరితంగా వివాదం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇలాంటి చిత్రాలను వక్రీకరించి నా పరువుకు భంగం కలిగిస్తున్నారు ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేత తెలిపారు. మరోవైపు, యువతి కూడా దీనిపై స్పందిస్తూ ఎంపీ అభ్యర్థికి సపోర్టుగా కామెంట్స్ చేసింది. సొంత కుమార్తెలా భావించే ఆయన ముద్దు పెట్టుకుంటే అందులో తప్పేముందన్నారు. ఇలాంటి ఘటనలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం మంచిది కాదు.. అక్కడ మా అమ్మానాన్న కూడా ఉన్నారని సదరు యువతి చెప్పింది.
If you cannot believe what you just saw, let us clarify. Yes, this is BJP MP & Maldaha Uttar candidate @khagen_murmu kissing a woman on his own accord on his campaign trail.
From MPs that sexually harass women wrestlers to leaders who make obscene songs about Bengali women, BJP… pic.twitter.com/f0PKdaDDn5
— All India Trinamool Congress (@AITCofficial) April 9, 2024
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!