సుమారు 2000 కోట్ల రూపాయలతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసామని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. గురజాల నియోజకవర్గంలో ఇంటింటికి కులాయి కార్యక్రమం 50 శాతం పూర్తి చేయగలిగాం.. మరొక 50 శాతం ప్రాజెక్టు పూర్తి చేస్తే నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు అని పేర్కొన్నారు. పిడుగురాళ్ల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు, బైపాస్ నిర్మాణాలు చేశాం.. సంక్షేమ కార్యక్రమాలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది అని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సంక్షేమ పథకాల ఫలాలు మాకు రక్షగా నిలుస్తాయి.. చరిత్రలో నిలిచిపోయే సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేశారు.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ లు కూడా ప్రజల కోసం పని చేశారు అని పేర్కొన్నారు. వాళ్ళిద్దరికి మించి, ప్రతి ఇంటికి చేరువైన ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల మనసు గెలిచారు అని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..
రాష్ట్రంలో సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరాయని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అన్నారు. చంద్రబాబు చెప్పే హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చరన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చి చివరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని చెప్పారు. ఇలాంటి వారిని గెలిపిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.. మరోసారి జగన్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు మీకు అందుతాయని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు.