AP Election 2024: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ మొదట ముఖ్యమంత్రి అన్నాడు.. ఆ తర్వాత మంత్రి అన్నాడు.. ఇప్పుడు ఎమ్మెల్యే చేయమంటున్నాడు.. ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు రేపు కార్పొరేటర్ స్థాయికి వస్తాడు అని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారు అని ఆయన ఆరోపించారు. ఇందులో ఏ మార్పు లేదు.. ఆ అగ్రిమెంట్ తోనే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు.. చంద్రబాబు నాయుడు పార్టీ కూడా బీజేపీలో చేరిపోతుంది.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వేరే పార్టీకి అవకాశం లేదు.. అందుకే అన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీలో విలీనం కావడం ఖాయం అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Read Also: Posani Krishna Murali: చంద్రబాబు, లోకేష్ తీర్థ యాత్రలకు వెళ్తే.. ఏపీలో మేము సంతోషంగా ఉంటాం..
అలాగే, చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ మీద ఎంత నీచంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని వెల్లంపల్లి శ్రీనివాస్ గుర్తు చేశారు. నిమ్మగడ్డ రమేష్‌తో కలిసి వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్లను అందజేయడాన్ని ఈ కుటమి నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అవ్వా తాతల ఉసురు పోసుకున్నారని విమర్శించారు. మంగళగిరిలో నారా లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మరోసారి ఓడిపోవడం ఖాయమన్నారు. ఈసారి కుప్పంలో చంద్రబాబు, రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరిని ప్రజలు ఓడించి తీరుతారని పేర్కొన్నారు.