గుంటూరు జిల్లాలోని ఏటుకురులో నిర్వహిస్తున్న మేమంత సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ జన సముద్రాన్ని చూస్తే మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు. ఈ జన ప్రభంజనం చరిత్రలో నిలిచిపోతుంది.. ప్రతి ఇంటి చరిత్రను కొత్త బంగారు లోకానికి తీసుకెళ్తుంది.. మన ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు మంచినీ కొనసాగించేందుకు వైసీపీకి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
కడప జిల్లాలోని పులివెందులలో వైసిపి బలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేనేంటో నా మనస్తత్వం ఏంటో ఇక్కడ ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. గడిచిన మూడేళ్లుగా ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉన్నారు.. అయినా చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో ప్రజలతోనే ఉన్నాను అని ఆయన చెప్పారు.
వైసీపీ పార్టీలో ఇపుడున్న విధానం సక్సెస్ ఫుల్ మోడల్.. మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని మంత్రి ధర్మాన ప్రసాదరావు జోస్యం చెప్పారు. వాలంటీర్లను రిజైన్ చేయమనoడి.. వారితో పని చేయించండి అని పేర్కొన్నారు.
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ లో గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యం అయింది. స్నేహితులతో సరదాగా గడిపేందుకు రుషికొండ బీచ్‌కు వచ్చిన యువకుడు నిన్న గల్లంతయ్యాడు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆయన ఈ నెల 25వ తేదీన పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల భేటీ ముగిసింది. సుమారు రెండు గంటల సేపు సాగిన ఎన్డీఏ కూటమి నేతల సమావేశం.. ఎన్నికల కోడ్ వచ్చినా మారని కొందరి అధికారుల పని తీరు మీదే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏ కూటమి నేతల భేటీలో ఒకట్రొండు స్థానాల్లో మార్పు చేర్పులపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అనపర్తి, ఉండి, తంబళ్లపల్లె, లాంటి స్థానాల్లో మార్పు చేర్పులపై ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తుంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు, కందుకూరు టీడీపీలో అసమ్మతి కొనసాగుతుంది. ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు టీడీపీ రెబల్స్ రెడీ అవుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్దిగా ముత్తుముల అశోక్ రెడ్డిని తెలుగు దేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించినట్లు మెడికల్ కళాశాల భూముల కొనుగోలులో నేను ఒక్క రూపాయి తీసుకున్నట్లు రుజువు చేస్తే పోటీ నుంచి విరమించుకుంటాను.. అలాగే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు.
వైసీపీ ఆభ్యర్థులను అత్యధిక మెజార్టితో గెలిపించాలి అని వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. అవినీతి లేకుండా చేసిన పాలనను ప్రతి రోజూ ప్రజలకు గుర్తు చెయాలి అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త 30 రోజుల ప్రోగ్రాం పెట్టుకుని ప్రజల దగ్గరకు వెళ్లాలి.. టీడీపీ - జనసేన- బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా వస్తున్నాయని ఆయన తెలిపారు.