గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంత సిద్ధం బస్సు యాత్ర చేసుకుంది. ఈ సందర్భంగా జగన్ బస్సుయాత్రలో అరుదైన దృశ్యం నెలకొంది. తాడేపల్లి జంక్షన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రకు ఆయన సతీమణి వైఎస్ భారతి సంఘీభావం తెలిపారు.
ప్రజాగళం 32వ సభ గుంటూరు జిల్లాలోని తాడికొండలో జరుగుతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ ఇది తాడికొండ కాదు రాష్ట్ర రాజధాని అమరావతి.. అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను.. ఈ రాజధానిని ఈ అమరావతిని ఒక వెంట్రుక కూడా ఎవరు కదిలించలేరు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, నారా లోకేష్ గతంలో ఏం చేశాం.. గెలిస్తే ఏం చేస్తామో ప్రజలకు చెప్పడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కే గ్యారెంటీ లేక పొత్తులు పెట్టుకున్నాడు అని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో న్యాయపత్ర అనే పేరుతో 48 పేజీల ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిందని రాజమండ్రి లోక్ సభ అభ్యర్థి గిడుగు రుద్రరాజు తెలిపారు. ఇందులో ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
చంద్రబాబు బీసీలకు పెన్షన్ పెంపు అని చెబుతున్నావు... ఇదో పెద్ద అబద్ధం అని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. జన్మభూమి కమిటీలతో నువ్వు చేసిన వికృత క్రీడలు జనం మర్చిపోలేదు.. ఐదేళ్ల నీ పరిపాలన కాలంలో పెన్షన్ పెంపు గురించి ఆలోచించావా అని ప్రశ్నించారు.
2024 సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కొన్ని రాజకీయ పార్టీల ప్రభావంతో పలువురు జిల్లా కలెక్టర్లు, బ్యూరోక్రసీలోని కొందరు ఉన్నతాధికారులు వచ్చే రెండు నెలల పాటు దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవద్దని ఏపీ చీఫ్ ఎన్నికల ప్రధాన అధికారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి లేఖ రాసింది.
రేపు గాజువాక పర్యటనకు వస్తున్న చంద్రబాబును విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వైఖరి ఏంటో చెప్పాలనీ జనం నిలదీయాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలు అడిగినా, అడగకపోయినా టీడీపీ సమాధానం చెప్పాలి అని పేర్కొన్నారు.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.
మహిళలు, యువకులు, రైతాంగం కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. తుక్కుగూడ జన జాతర బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మోగించిందన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తన 30 రోజులు కష్టపడితే చేవెళ్ల పార్లమెంట్ ప్రజల కోసం అహర్నిశలు పని చేస్తానన్నారు.