ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు, కందుకూరు టీడీపీలో అసమ్మతి కొనసాగుతుంది. ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు టీడీపీ రెబల్స్ రెడీ అవుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్దిగా ముత్తుముల అశోక్ రెడ్డిని తెలుగు దేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. కూటమి నుంచి రెబల్ అభ్యర్దిగా పోటీ చేసేందుకు జనసేన నేత ఆమంచి స్వాములు కూగీ సిద్దమవుతున్నారు. కాగా, ఇప్పటికే గిద్దలూరు నియోజకవర్గంలోని తన అనుచరులతో సమాలోచనలు పూర్తి చేసిన ఆమంచి స్వాములు.. గిద్దలూరు నుంచి పోటీ చేస్తానని ఆమంచి స్వాములు ఇప్పటికే ప్రకటించారు.
Read Also: Manjummel Boys: లవ్ లెటర్ టు మంజుమ్మల్ బాయ్స్
అయితే, ప్రస్తుతం నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీ అభ్యర్దిగా ఇంటూరి నాగేశ్వర రావును తెలుగు దేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. అలాగే, టీడీపీ రెబల్ గా బరిలో నిలిచేందుకు ఆ పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ రంగం సిద్దం చేసుకుంటున్నారు. సీటు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేసిన రాజేష్.. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో చర్చలు సైతం జరిపాడు. పార్టీ అధిష్టానం టికెట్ విషయంలో మార్పులు చేయకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని రాజేష్ అల్టిమేటం జారీ చేశారు. అయితే, ఇప్పటికే నియోజకవర్గంలో రాజేష్ ప్రచారం కూడా చేస్తున్నారు. ఇద్దరు టీడీపీ నేతలు నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండటంతో తెలుగుదేశం పార్టీలో అయోమయం నెలకొంది.