గుంటూరు జిల్లాలోని ఏటుకురులో నిర్వహిస్తున్న మేమంత సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ జన సముద్రాన్ని చూస్తే మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు. ఈ జన ప్రభంజనం చరిత్రలో నిలిచిపోతుంది.. ప్రతి ఇంటి చరిత్రను కొత్త బంగారు లోకానికి తీసుకెళ్తుంది.. మన ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు మంచినీ కొనసాగించేందుకు వైసీపీకి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రతి గ్రామగ్రామన అభివృద్ధి చేసింది.. రైతులు కందుతున్న భరోసాలు, పిల్లలకు అందుతున్న క్వాలిటీ ఎడ్యుకేషన్, అవ్వ తాతలకు అందుతున్న పెన్షన్లు కొనసాగించడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
Read Also: Nallapareddy Prasanna Kumar: బంగారంగా తీసుకోండి.. తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకు వేయండి..!
ఒక్క రూపాయి లంచం లేకుండా.. వివక్షకు తావు లేకుండా.. నేరుగా 130 సార్లు బటన్ నొక్కిన మీ బిడ్డ అడుగుతున్నాడు అని సీఎం జగన్ తెలిపారు. మీకు ఉన్న ఓటు హక్కుతో రెండు ఓట్లు వైసీపీకి వేయడానికి సిద్ధంగా ఉండాలి.. ఈ యుద్ధం చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న యుద్ధం కాదు.. చంద్రబాబు చేస్తున్న మోసాలకు, పేద ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. ఈ అబద్ధాల బాబుకు మరో ఇద్దరు వంత పడుతున్నారు.. ఒకరు దత్తపుత్రుడు, మరొకరు చంద్రబాబుకు వదిన.. ఈ సిద్ధం సభ సాక్షిగా చెబుతున్నాను.. ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఏ రకంగా మీ జీవితాలలో మార్పులు తీసుకొచ్చాడో మీకు చెప్తాను అని సీఎం జగన్ పేర్కొన్నారు.
Read Also: Rohit Sharma: ఆ ఆలోచనే లేదు.. అప్పటివరకు నేను క్రికెట్ ఆడుతాను.. రోహిత్ శర్మ..!
అయితే, గతంలో ఎప్పుడు జరగనీ విధంగా ఈ 58 నెలల కాలంలో.. మీ బిడ్డ ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడో మీకు చెప్తాను అని వైఎస్ జగన్ చెప్పారు. మీ బిడ్డకు ఓటు వేయడం అంటే ఈ 58 నెలలు కాలంలో మీకు జరిగిన మంచిని కొనసాగించాలని మీరు తీసుకున్న నిర్ణయంపై ఆధారపడి ఉందన్నారు. ఒకవేళ చంద్రబాబుకు ఓటు వేస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి.. చంద్రబాబుకి ఓటు వేస్తే సంక్షేమం ఆగిపోవాలని మీరు నిర్ణయం తీసుకున్నట్లే అని ఆయన చెప్పారు. సింగపూర్ ను మించిన అభివృద్ధి చేస్తాను అని చంద్రబాబు చెప్పారు.. కానీ ఎక్కడ చేశారు అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు.