కడప జిల్లాలోని పులివెందులలో వైసిపి బలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేనేంటో నా మనస్తత్వం ఏంటో ఇక్కడ ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. గడిచిన మూడేళ్లుగా ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉన్నారు.. అయినా చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో ప్రజలతోనే ఉన్నాను అని ఆయన చెప్పారు. ఎన్ని కుట్రలు చేస్తారో చేసుకోండి.. మీరు ఎన్ని కుట్రలు చేసినా నేను ప్రజలలోనే ఉంటాను.. నేను ఏ తప్పు చేయలేదు.. ఇదే ఆత్మవిశ్వాసంతో ఉంటా ప్రజలతోనే ఉంటా ప్రజల కోసమే ఉంటాను అని కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Middle East tensions: ఇజ్రాయిల్, ఇరాన్ వెళ్లొద్దని భారతీయులకు కేంద్రం కీలక ఆదేశాలు..
అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని మరోసారి కడప ఎంపీ అవినాష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాగా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరుఫున సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షరాలు వైఎస్ షర్మిల రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎన్నికల సమరంలో వైఎస్ కుటుంబ సభ్యులు పోటీ పడుతుండటంతో కడప లోక్ సభ ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.