తన కోసం ఈ 30 రోజులు కష్టపడితే.. రానున్న ఐదేండ్లు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, సామాన్య ప్రజల కోసం పని చేస్తానని చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.
శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి జీవిమాను కూడలిలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర బహిరంగ సభలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబాయిని చంపుకుని ఇతరుల మీద నెట్టి అధికారంలోకి వచ్చిన సైకో జగన్. అలాంటి సైకోని గెలిపించి అనుభవిస్తున్నారు అని ఆరోపించారు.
కర్నూల్ జిల్లా ఆదోని మండలం పెద్ద హరివనం గ్రామానికి చెందిన నిర్మల చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేది. చదువంతా ప్రభుత్వ విద్యాయాల్లోనే కొనసాగించింది. అయితే, ఎంతో పట్టుదలతో చదువుతున్న ఆమె ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాపర్ గా నిలిచింది.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 15వ రోజు ఆదివారం (ఏప్రిల్ 14) నాటికి సంబంధించిన షెడ్యూల్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
నెల్లూరు జిల్లాకు తెలుగంగ ప్రాజెక్టును తీసుకువచ్చిన ఘనత మా తండ్రిదే.. మహిళలంటే మాకు చాలా గౌరవం.. నమ్ముకున్న వారిని మోసం చేయడం చంద్రబాబు నైజం అని ఆయన ఆరోపించారు. కోవూరులో మూడు సంవత్సరాల పాటు దినేష్ రెడ్డిని తిప్పారు.. టికెట్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు.