వైసీపీ ఆభ్యర్థులను అత్యధిక మెజార్టితో గెలిపించాలి అని వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. అవినీతి లేకుండా చేసిన పాలనను ప్రతి రోజూ ప్రజలకు గుర్తు చెయాలి అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త 30 రోజుల ప్రోగ్రాం పెట్టుకుని ప్రజల దగ్గరకు వెళ్లాలి.. టీడీపీ – జనసేన- బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా వస్తున్నాయని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల్లో ఈ ముగ్గురు కలిసి ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చారు.. ఏం చేసారన్నది ప్రజలకు గుర్తు చేయాలి అని చెప్పుకొచ్చారు. నాడు కూటమి నేతలు చేసిన మోసం ప్రజలకు మరో సారి గుర్తు చెయండి అని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Read Also: Sikkim:17,000 అడుగుల ఎత్తులో ‘యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి’ని పరీక్షించిన ఆర్మీ..!
ఈ కూటమి నేతలు అబద్దాలు చెబుతారు, అమలకు సాథ్యం కానీ హామీలు ఇస్తారు అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వాటిని సాక్షాలతో సహా ప్రజలకు చూపించాలి.. రాష్ర్టంలో అభివృద్ధి జరగలేదని టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి నేతలు వైసీపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. 10 వేల సచివాలయాలు, 10 వేల రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేశామన్నారు. నాడు – నేడు ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి గ్రామంలోని స్కూళ్ల యొక్క రూపు రేఖలు మార్చాం అని చెప్పారు. నాలుగు ఓడరేవులు నిర్మాణం మన ప్రభుత్వంలో జరుగుతుందని ప్రజలకు చెప్పాలి.. అలాగే, 17 సూపర్ స్పెషాలిటీ హాస్పటిల్ తో పాటు మెడికల్ కళాశాలలు నిర్మాణం చేస్తున్నాము.. ఉద్దానం ప్రాంతంలోని ప్రజల కిడ్ని సమష్యలకు శాశ్వత పరిస్కారం అందించామని ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.