కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేత పి.చిదంబరం ఇవాళ (గురువారం) అన్నారు. మోడీ హామీల జాడ ఎక్కడా లేదని, బీజేపీ అబద్ధాలు చెప్పడం, వక్రీకరించడం, దుర్వినియోగం చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని తెలిపారు.
శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపించారు. దేశంలో మొత్తం 70 ఏళ్ల పరిపాలన కాలంలో దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు అద్భుతంగా పని చేశారని ఆయన పేర్కొన్నారు.
పాణ్యం నియోజకవర్గం మొత్తం పసుపుయంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితరెడ్డి నామినేషన్ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గౌరు అభిమానులు భారీ ర్యాలీగా వచ్చి కదం తొక్కారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని దిబాంగ్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే జాతీయ రహదారి 33లో కొంత భాగం కొట్టుకుపోయింది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మరో సారి కాల్పుల మోత కొనసాగుతుంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్ జవాన్లకు అలాగే, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాను తన ప్రాణాలను కోల్పోయారు.
టెలికం రంగంలోకి అడుగు పెట్టి సంచలనం సృష్టించి దేశంలోనే అతి పెద్ద టెలికం నెట్వర్క్గా అవతరించిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద టెలికం నెట్వర్క్గా జియో నిలిచింది.