లోక్సభ ఎన్నికలు 2వ దశ ఓటింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని బాలూర్ఘాట్లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు.
ఇరాన్తో వ్యాపారం చేసిన పలు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. వీటిలో మూడు భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇరాన్కు చెందిన ఆయుధాలను అక్రమంగా రష్యాకు చేరవేయడంలో సహాయం చేశారనే కారణంతో పలు కంపెనీలు, వ్యక్తులు, నౌకలపై యూఎస్ ఆంక్షల పర్వం కొనసాగిస్తుంది.
గుంటూరులోని ఆటోనగర్ లో గురువారం నాడు సాయంత్రం జరిగిన మోటార్ ఫీల్డ్ సోదరుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఈవీఎంలలో నమోదయ్యే ఓట్ల సంఖ్యను అక్కడే ఉంచే వీవీప్యాట్ల నుంచి జారీ అయ్యే స్లిప్పులతో వందకు వందశాతం సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ (శుక్రవారం) సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది.
కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేత పి.చిదంబరం ఇవాళ (గురువారం) అన్నారు. మోడీ హామీల జాడ ఎక్కడా లేదని, బీజేపీ అబద్ధాలు చెప్పడం, వక్రీకరించడం, దుర్వినియోగం చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని తెలిపారు.
శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపించారు. దేశంలో మొత్తం 70 ఏళ్ల పరిపాలన కాలంలో దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు అద్భుతంగా పని చేశారని ఆయన పేర్కొన్నారు.