ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు మండల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుతో కలిసి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం నాడు పర్యటించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో జరిగిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్ కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు తెలిపింది.
కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. 2018లో యువ నాయకుడు నారా లోకేష్ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో చిత్తూరు జిల్లా కుప్పం మండల కేంద్రంలో మదర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ మండలంలోని అన్ని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్లతో నీటిని సరఫరా చేశారని తెలిపారు.
ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందు వరుసలో నిలబెట్టిన తనను గెలిపించే బాధ్యత ప్రజలదైతే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యత తనదని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు.
తిరువూరు పట్టణంలోని 19వ వార్డులో ఎన్డీయే కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటిఇంటికి తిరిగిన కొలికపూడికి మహిళలు మంగళ హారతులు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు పట్నం సునీత రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.