రాహుల్ బాబాను సోనియా గాంధీ 2-20 సార్లు లాంఛ్ చేసినా ఇప్పటి వరకూ సక్సెస్ కాలేదని ఎద్దేవా చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ అమేథి నుంచి పారిపోయి రాయ్బరేలిలో నామినేషన్ దాఖలు చేశారని అమిత్ షా పేర్కొన్నారు.
తెనాలిలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో గురువారం నాడు జయహో బీసీ కార్యక్రమం జరిగింది. తెనాలి నియోజకవర్గ నాయకులతో పాటు గ్రామ మండల స్థాయి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్ పేటలో బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
భారత్పై పాకిస్థాన్ విషం చిమ్ముతూనే ఉంది. ఐక్యరాజ్యసమితిలో రామ మందిర అంశాన్ని మరోసారి లేవనెత్తింది. అయితే, ఈసారి అయోధ్య రామమందిరాన్ని మానేసినట్లు పాక్ తెలిపింది.
పాకిస్థాన్ దేశంలో దారుణం చోటు చేసుకుంది. ఇవాళ (శుక్రవారం) వాయువ్య పాకిస్తాన్లోని కొండ ప్రాంతం నుంచి ప్రయాణీకులతో కూడిన బస్సు లోయలో జారిపడటంతో దాదాపు 20 మంది వరకు మరణించారు.