కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేత పి.చిదంబరం ఇవాళ (గురువారం) అన్నారు. మోడీ హామీల జాడ ఎక్కడా లేదని, బీజేపీ అబద్ధాలు చెప్పడం, వక్రీకరించడం, దుర్వినియోగం చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి పి చిదంబరం ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా పి.చిదంబరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, యువత, మహిళల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. ఇక, మా మేనిఫేస్టోలో అసలు ఆస్తి పంపిణీ, వారసత్వ పన్ను గురించి ప్రస్తావించలేదన్నారు. 1985లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టేట్ డ్యూటీని రద్దు చేసిందని వివరించారు.
Read Also: Sanjay Raut: 50 ఏళ్లలో కాంగ్రెస్ ప్రధానులు బాగా పని చేస్తే.. మోడీ దేశాన్ని అమ్మేస్తున్నాడు..
ఇక, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని పి. చిదంబరం తెలిపారు. దేశ జీడీపీ వేగంగా వృద్ధి చెందేందుకు దారి తీసే విధానాలను రూపొందిస్తామన్నారు. ప్రజా సంక్షేమం అంటే పేద, మధ్యతరగతి వర్గాల ఆదాయం పెంచాలన్నారు. బీజేపీ తప్పుడు ప్రకటనలు, అబద్ధాలతో ప్రజలను రెచ్చగొడుతుందన్నారు. దేశాన్ని విభజించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రను ప్రజలకు గమనిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజల ఆస్తులు లాక్కుంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు.