అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో పలు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దాడులు చేస్తోంది. ఈ దాడిలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ నుంచి 25 కోట్ల రూపాయలను ఈడీ స్వాధీనం చేసుకుంది.
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది. అయ్యప్ప దర్శనానికి 80 వేల మందిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో ఎన్టీఆర్ జిల్లా రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
హర్షల్ పటేల్ బౌలింగ్ లో మహేంద్ర సింగ్ ధోని గోల్డెన్ డక్ గా పెవిలియన్ బాట పట్టడంతో స్టాండ్స్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మాత్రం తన సంతోషాన్ని ఆపుకోలేకపోయింది.
ఐపీఎల్ లో ఇవాళ ( సోమవారం ) ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడబోతుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు జరగనుంది.
ఈనెల 9వ తేదీ లోపు రైతు భరోసా డబ్బులు పూర్తిగా అకౌంట్స్ లో పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఇక, రైతు రుణమాఫీపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేశాం.. కేసీఆర్ ఆరు గ్యారంటీలు అమలు కాలేదు అంటున్నాడు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.