Benjamin Netanyahu: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధంపై వస్తున్న విమర్శలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. తమని తాము రక్షించుకోవడం నుంచి ఏ ఒత్తిడీ ఆపలేదన్నారు. ఒకవేళ ఈ పోరాటంలో ఒంటరిగా వెళ్లాల్సి వస్తే.. అందుకు తాము రెడీగా ఉన్నామన్నారు. రెండో ప్రపంచ యుద్ధం టైంలో నాజీలు 60 లక్షల మంది యూదులను ఊచకోత కోశారు.. మాకు అప్పుడు కూడా ఎలాంటి రక్షణ లేదు అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మమల్ని నాశనం చేద్దామని అనుకుంటున్న ప్రత్యర్థులను ఈరోజు మళ్లీ ఎదుర్కొంటున్నామన్నారు. ఈ ప్రపంచంలో ఏ నాయకుడు, ఎలాంటి ఒత్తిడి, ఏ అంతర్జాతీయ సంస్థ తమ నిర్ణయమూ మమ్మల్ని నియంత్రించలేదు అని తన మద్దతుదారులను ఉద్దేశించి నెతన్యాహు ప్రసంగించారు.
Read Also: CM Revanth Reddy: నేడు అంబర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్ లో సీఎం పర్యటన
కాగా, అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో గాజా యుద్ధానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తప్పుబట్టారు. వాటిని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ వర్సిటీల్లో జరిగిన వివక్షాపూరిత ఘటనలతో ఆయన సరిపోల్చారు. ఎలాంటి ఒత్తిడీ తమ చేతులను బంధించలేదు.. విజయం సాధించే వరకు పోరాడతామని నెతన్యాహు వెల్లడించారు.
Read Also: China: పెళ్లికి ముందు వైద్య పరీక్షలు.. పురుషుడిగా తేలిన మహిళ
హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది. ఈ పోరులో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు విడిచారు. తీవ్ర ఆస్తి నష్టం జరిగడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తీరును అమెరికా సహా పలు దేశాలు తప్పుబట్టాయి. వీలైనంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాయి. నరమేధానికి పాల్పడుతోందన్న ఆరోపణలతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లోని ఓ విభాగంపై అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలను విధించింది. ఇక, యూఎస్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ బెంజమిన్ నెతన్యాహు ఈ కామెంట్స్ చేశారు.