దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేడు (మే 5న) నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరుగుతుంది.
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కైసర్‌గంజ్ ఎంపీ టికెట్ ను ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కు బీజేపీ కేటాయించింది. దీంతో శుక్రవారం నాడు కరణ్ నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంగా ఆయన తన అనుచరగణంతో హల్ చల్ చేశారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శిబిరం తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, బావమరిది రాబర్ట్ వాద్రాలను కావాలనే పక్కన పెట్టిందని ఇవాళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విమర్శలు గుప్పించింది.
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా నాన్న కాకర్ల సురేష్ ని గెలిపించాలని ఆయన కొడుకు సంహిత్, కూతురు ధాత్రి ఉదయగిరిలోని గొల్లపాలెం, ఎస్సీ, ఎస్టీ పూసల కాలనీలలో తండ్రితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి త్వరలో తాళం వేసి.. ఆయన హైదరాబాద్ కు జంప్ అవుతారని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చెప్పుకొచ్చారు. అలాగే, బీజేపీలో తెలుగుదేశాన్ని కూడా విలీనం చేస్తారన్నారు.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రికి హత్య బెదిరింపులు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ హయాంలోని భజన్‌లాల్ శర్మ కేబినెట్లో గిరిజన శాఖ మంత్రిగా ఉన్న బాబులాల్ ఖరాడీని చంపేస్తామంటూ కొందరు వ్యక్తులు వార్నింగ్ ఇచ్చారు.