Rythu Bharosa money: నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు మహిళలకు అవకాశం దక్కలేదు అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ గోండు మహిళ కి అవకాశం ఇచ్చింది.. కొమరం భీమ్ స్పూర్తితో ఆత్రం సుగుణని గెలిపించాలని కోరుతున్నాను అని చెప్పుకొచ్చారు. రైతు బంధు పడలేదని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అంటున్నారు.. ఈనెల 9వ తేదీ లోపు రైతు భరోసా డబ్బులు పూర్తిగా అకౌంట్స్ లో పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఇక, రైతు రుణమాఫీపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేశాం.. కేసీఆర్ ఆరు గ్యారంటీలు అమలు కాలేదు అంటున్నాడు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: Chelluboina Venu: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం.. చట్టపరమైన చర్యలు తప్పవు..!
ఇక, కేటీఆర్ చీర కట్టుకుని బస్సు ఎక్కితే తెలుస్తుంది… ఆరు గ్యారంటీలు అమలయ్యాయో లేదో తెలుస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మేము రుణమాఫీ చేస్తే, ఉపాధి హామీ పనులు ఇస్తే ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు బీజేపీ నేతలు అంటున్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. పేదల బతుకులు ఆగం అవుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే, దేశంలోని ప్రభుత్వ సంస్థలను అన్నింటినీ బీజేపీ అమ్మేస్తుందని ఆయన విమర్శించారు.