One Nation One Election: ‘ఒక దేశం-ఒకే ఎన్నికల’ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తాం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: ఎన్‌డీఏ మళ్లీ అధికారంలోకి వస్తే ‘ఒక దేశం-ఒకే ఎన్నికల’ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ భూమి మీద డైనోసార్‌లు కనుమరుగైనట్లే దేశంలోని రాజకీయ రంగం నుంచి పురాతన పార్టీ కనుమరుగవుతుందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. పదేళ్ల తర్వాత ఏ పిల్లాడిని అడిగినా కాంగ్రెస్ పార్టీ ఏంటో చెబుతాడన్నారు. రాహుల్ గాంధీని పాకిస్థాన్‌లో అభిమానిస్తున్నారని ఆరోపించిన ఆయన.. గాంధీ కుటుంబానికి భారతదేశంలో రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదన్నారు.
Read Also: Uttarakhand : అడవుల్లో చల్లారని మంటలు.. హిమాలయాలు కరిగే ప్రమాదం
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
అయితే, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి మద్దతు ఇవ్వలేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కానీ, బీజేపీ మాత్రం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించిందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక భారత్ ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా దేశం అడుగులు వేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. మోడీ నాయకత్వంలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నాలుగైదు గంటల పాటు ఆగిపోయిందని.. తద్వారా భారత్ తన 22,000 మంది పౌరులను ఖాళీ చేయగలిగామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.
Read Also: IPL 2024 Orange Cap: ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ కోహ్లీకి దక్కేనా..?
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉండేవని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అయితే, అటల్ బిహారీ వాజ్‌పేయి లేదా మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాలపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని చెప్పారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి హామీలను బీజేపీ నెరవేర్చిందని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?