కేసీఆర్ ప్రభుత్వం దిగిపోతూ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ అప్పుకు దాదాపు 30వేల కోట్ల రూపాయల మిత్తిని చెల్లించామన్నారు.
ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో మంచి చేసే వారికే మద్దతు ఇవ్వాలని, ఉన్నతమైన విలువలు, నీతి, నిజాయతీ కలిగిన నాయకులకు మీ ఆశీస్సులు అందించి ఆశీర్వదించండని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు.
కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజా కుమారుడు దాడిశెట్టి శంకర్ మల్లిక్ తన తండ్రి కోసం పల్లె పల్లెను పలకరిస్తూ.. ప్రజలతో మమేకమౌతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
టీ20 వరల్డ్కప్-2024 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టు న్యూ జెర్సీని రివీల్ చేసింది. మ్యాట్రిక్స్ జెర్సీ' 24 పేరుతో పీసీబీ బోర్డ్ తమ కొత్త జెర్సీని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
‘వన్ జెర్సీ వన్ నేషన్’ స్లోగన్తో సోమవారం నాడు విడుదల చేయగా.. అది నారింజ, నీలం రంగుల కలయికతో కూడి ఉంది. ఈ జెర్సీపై వీ ఆకారంలో త్రివర్ణ రంగులతో రూపొందించారు. అయితే ఈ జెర్సీపై క్రికెట్ అభిమానుల దగ్గర నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. 2019 వన్డే ప్రపంచకప్ జెర్సీ ఉన్నట్లు ఉందని కొందరు అంటుంటే.. బీజేపీ పార్టీ రంగును పోలి ఉందని మరి కొందరు విమర్శలకు దిగుతున్నారు.
గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి.. అందిన సంక్షేమం చూడాలని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో ఎమ్మెల్యే పర్యటించారు.