మోడీ పని రాక్షసుడు.. ఆయన నిద్రపోరు.. మమ్మల్ని నిద్రపోనివ్వరు అంటూ ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మోడీ లాంటి వ్యక్తి దేశానికి అవసరమైన నాయకుడు.. సెలవు ఉంది కదా అని ఓటెయ్యకుండా ఉండకండి.. ఓటేసి సెలవు తీసుకోండి అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా ఉండి భారతీయ జనతా పార్టీలోకి చేరాల్సిన అవసరం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు టీఆర్ఎస్ అసత్య ప్రసారం చేస్తుంది.. ఎన్నికల్లో ఓట్లు సాధించడం కోసమే ఈ దుష్ప్రచారం అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
దేశంలో మత ప్రతిపాదకన హిందూ -ముస్లింల మధ్య ప్రధాని మోడీ చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. స్వతహాగా రాజకీయంలో ఎదిగిన వ్యక్తిని నేను.. దేశ సమగ్రత కొరకు కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ.. బలహీన వర్గాల రిజర్వేషన్లు తీసి వేసి రాజ్యాంగని మార్చే కుట్ర చేస్తున్నారని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
నెలలు నిండకుండానే జన్మించిన పసికందులకు ఎంజీంలోని పీడియాట్రిక్ యూనిట్ ఐసీయూ/హెచ్డీయూ వార్డుల్లో ట్రీట్మెంట్ అందిస్తుంటారు. వీరి కోసం రెండు వార్డుల్లో కలిపి నాలుగు చొప్పున 8 ఏసీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి పని చేయడం లేదు.. ఓ వైపు ఎండలతో ఉష్ణోగ్రత స్థాయి పెరిగి పసికందులు తల్లడిల్లిపోతున్నాయి.
కరీంనగర్ లోని అంబేడ్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలిసి బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎలక్షన్ ప్రసారం నిర్వహించారు. వాకర్స్ క్రీడాకారులను కలిసి తమకు ఓటు వేయాలంటూ క్రికెట్, వాలీబాల్ ఆడారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జగిత్యాల పట్టణంలో నేడు (ఆదివారం) పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డికి మద్దతుగా పట్టణంలో నిర్వహించే రోడ్డు షోలో పాల్గొననున్నారు.