తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన చిత్రం వావాతియార్. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఈ సినిమాను అన్నగారు వస్తారు పేరుతో తీసుకువస్తున్నారు. నిథిలిన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించారు. వా వాతియార్‌ను గతంలో డిసెంబర్ 5న తీసుకు వస్తున్నట్లుగతంలో ఎనౌన్స్ చేశారు మేకర్స్.
Also Read : Tollywood : కెరీర్ ను టర్న్ చేసే సినిమా కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు
కానీ ఫైనాన్స్ ఇష్యూ కారణంగా రిలీజ్ వాయిదా వేశారు. ఆ తర్వాత డిసెంబరు 12న రిలీజ్ అని మరొక డేట్ వేశారు. అందుకు తగ్గట్టు హీరో కార్తీ తెలుగులో ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నాడు. రిలీజ్ కు కేవలం కొన్ని గంటల ముందు మరోసారి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ఇలా వాయిదాల మీదా వాయిదాలు పడుతూ వస్తున్న అన్నగారు వస్తారు అసలు రిలీజ్ అవుతుందా లేదా అనే డైలమా నెలకొంది. అయితే ఇప్పుడు మరోసారి అన్నగారు వస్తారు అని ఈ డిసెంబరు 25న థియేటర్స్ లో తప్పకుండా దిగుతాడని చెన్నై మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే ఒకరోజు ముందుగా అనగా 24న ప్రీమియర్స్ కూడా వేయబోతున్నారట. కానీ ప్రేక్షకులు మాత్రం మాకు నమ్మకం లేదు. థియేటర్ లో మార్నింగ్ షో పడిన తర్వాతే నమ్ముతాం. ఇప్పటికి ఎన్ని సార్లు వాయిదా వేస్తారు. అసలు అన్నగారు ఈసారైనా వస్తారా లేదా మరొక సాకుతో వెనక్కి వెళ్తారా అని సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు. ఒకవేళ వచ్చిన 25న టాలీవుడ్ లో డజను సినిమాలతో కార్తీ సినిమాకు పోటీ తప్పదు.