తమిళ హీరో శివకార్తికేయన్ ప్రజంట్ తన మార్కెట్‌ను, క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పరాశక్తి’ లో నటిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఈ పీరియాడిక్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లో కూడా ఈ సినిమా గురించి ఇంట్రెస్ట్ బాగా పెరగడంతో, నాన్-థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ ఏర్పడింది.
Also Read : Vishnu Priya : నిజంగా ఆయన అలాంటివాడని అనుకోలేదు.. వేణు స్వామి పై విష్ణు ప్రియ సంచలన వ్యాఖ్యలు
ఇక తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడానికి ఓటీటీ దిగ్గజాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. మొదట నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 45 కోట్లు ఆఫర్ చేసినప్పటికీ, చివరకు జీ5 (Zee5) సంస్థ అనూహ్యంగా రూ. 52 కోట్లకు డీల్‌ను ఫైనల్ చేసుకుంది. ఈ మొత్తం శివకార్తికేయన్ కెరీర్‌లోనే అత్యధిక డిజిటల్ డీల్ కావడం విశేషం. ఈ రికార్డ్ బ్రేకింగ్ డీల్‌తో, శివకార్తికేయన్ మార్కెట్ రేంజ్ ఎంత పెరిగిందో స్పష్టమవుతోంది. ఈ ఓటీటీ ఒప్పందం సినిమా మేకర్స్‌కు భారీ లాభాలను అందించడంతో పాటు, రిలీజ్‌కు ముందే సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగాన్ని సురక్షితం చేసింది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ బాస్కరన్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. శివకార్తికేయన్‌తో పాటు, ఈ సినిమాలో జయం రవి, అథర్వ మురళి, శ్రీలీల వంటి స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. జి.వి. ప్రకాష్ సంగీతం, రవికే చంద్రన్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ పీరియాడిక్ డ్రామాకు ముఖ్య బలాలుగా నిలవనున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా, ఈ సినిమాను ఫ్యాన్స్ కోసం పండుగ సందర్భంగా 2026 పొంగల్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.